Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 14 April 2025
webdunia

ఏపీలో దుర్మార్గ, రాక్షస పాలన నడుస్తోంది.. బాలయ్య

Advertiesment
Balakrishna
, సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (09:25 IST)
టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ వైఎస్సార్ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. నెల్లూరు కార్యకర్తలతో ఫోన్‌లో మాట్లాడిన బాలయ్య ఏపీలో దుర్మార్గ పాలన నడుస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న వాటికి వంద రెట్లు చూపిద్దాం అంటూ సంచలన కామెంట్స్ చేశారు. బోయపాటి సినిమా తర్వాత రోడ్ల మీదకు వస్తానన్న బాలయ్య.. ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమన్నారు. కార్యకర్తలను దేనికీ భయపడొద్దని, మానసికంగా ప్రిపేర్ అవుతున్నా దేనికైనా రెడీ అన్నారు.
 
హిందూపురం పర్యటనలో తనను వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంపై సీరియస్ అయిన బాలయ్య.. నేను ఒక్క సైగ చేస్తే...ఏమయ్యేదంటూ సీరియస్ అయ్యారు. కక్ష సాధింపు చర్యలతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందన్నారు బాలకృష్ణ. తండ్రి మండలిని పునరుద్ధరిస్తే.. కుమారుడు రద్దు చేస్తున్నాడంటూ జగన్‌పై సెటైర్లు వేశారు బాలయ్య.
 
ఇకపోతే.. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో బాలకృష్ణ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. ఈ చిత్రాన్ని మే 28న విడుదల కానుందని చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆ రోజు ఎన్టీఆర్ జయంతి కావడంతో అదే రోజు సినిమాను విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక, మరోవైపు సినిమా షూటింగ్ గ్యాప్‌లో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తూర్పుగోదావరి జిల్లాలో వేడెక్కిన రాజకీయం