Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్‌ఫోన్‌లలో ఎఫ్ఎమ్ రేడియో గోవిందా... ఖర్చు తగ్గించాలని...?

Webdunia
సోమవారం, 8 మే 2023 (15:42 IST)
FM Radio
భారత్‌లో విడుదలైన స్మార్ట్‌ఫోన్‌లలో ఎఫ్ఎమ్ రేడియో సౌకర్యం కనుమరుగైంది. దీంతో భారత సర్కారు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. స్మార్ట్ ఫోన్లలో తప్పనిసరిగా ఎఫ్ఎ‌మ్ రేడియో వుండి తీరాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్మార్ట్ ఫోన్ కంపెనీలు తలపట్టుకున్నాయి. 
 
దేశంలోని చాలా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ అనేక మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లను విక్రయిస్తున్నాయి. కెమెరా, ఇంటర్నెట్, ఫింగర్ సెన్సార్, జీపీఎస్ వంటి అనేక ఫీచర్లతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్లు ఎఫ్ఎమ్ రేడియో సౌకర్యం లేకుండానే విడుదలవుతున్నాయి. ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్‌లలో రేడియో శ్రోతల సంఖ్య తక్కువగా ఉన్నారు. అయితే రేడియోకు అలవాటు పడిన శ్రోతలు ఇంటర్నెట్ ద్వారా ఆన్‌లైన్‌లో రేడియోను వింటున్నారు.  
 
ఇందుకు కారణం ఖర్చులను తగ్గించడానికి స్మార్ట్‌ఫోన్ కంపెనీలు FM చిప్‌సెట్‌లకు దూరంగా ఉన్నాయి. కాబట్టి ప్రస్తుత స్మార్ట్‌ఫోన్‌లు రేడియోకు దూరంగా వుంటున్నాయి. కానీ ఎఫ్‌ఎం సదుపాయాన్ని తొలగిస్తూ భారత ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో, భారతదేశంలో విక్రయించే అన్ని స్మార్ట్‌ఫోన్‌లలో ఎఫ్‌ఎం ఫ్రీక్వెన్సీని క్యాప్చర్ చేసే చిప్‌సెట్‌ను అమర్చాలని, ఎఫ్‌ఎమ్ రేడియో సౌకర్యాన్ని అందించాలని చెప్పబడింది. 
 
ఈ ఫీచర్‌ను తొలగించడానికి స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు అనుమతి లేదని కూడా చెప్పినట్లు తెలుస్తోంది. భారత్‌లో కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఎం రేడియో సేవలను విస్తరిస్తున్న తరుణంలో రేడియో వినే అలవాటును ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకమవుతుండడం గమనార్హం. అలాంటి పరిస్థితుల్లో స్మార్ట్ ఫోన్లలో ఎఫ్ఎమ్‌ను సదరు కంపెనీలు తొలగించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments