Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ.15000 లోపు బెస్ట్ మొబైల్ ఏది.. ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం..

Advertiesment
Samsung Galaxy M12
, మంగళవారం, 24 జనవరి 2023 (16:53 IST)
Samsung Galaxy M12
దేశంలో 15వేల రూపాయల్లోపు గల సూపర్ స్మార్ట్ ఫోన్ల వివరాలు తెలుసుకుందాం. శాంసంగ్, రెడ్ మీ, రియల్ మీ, ఒప్పో, వివో వంటి ప్రఖ్యాత స్మార్ట్ ఫోన్ బ్రాండ్ల నుంచి వచ్చే రూ.15000 లోపు బెస్ట్ ఫోన్లు వున్నాయి. అవసరాన్ని బట్టి ఉత్తమంగా సరిపోయే వాటిని ఎంచుకోవచ్చు. 
 
శాంసంగ్ గెలాక్సీ ఎం12 (6 జీబీ ర్యామ్, 128 జీబీ) -రూ.13,999
రెడ్ మీ నోట్ 11 (4 జీబీ ర్యామ్, 64 జీబీ) -రూ.12,999
రియల్ మీ 10 (రష్ వైట్ 64 జీబీ, 4 జీబీ ర్యామ్) -రూ.14,999
పోకో ఎం5 (పవర్ బ్లాక్, 64 జీబీ, 4 జీబీ ర్యామ్) -రూ.10,799
రియల్ మీ సీ35 (4జీబీ ర్యామ్, 64జీబీ) - రూ.11,880
 
శాంసంగ్ గెలాక్సీ ఎం12 (6 జీబీ ర్యామ్, 128 జీబీ)
శాంసంగ్ ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లలో ఒకటి, ఈ శాంసంగ్ ఎం 12 అసాధారణమైన సెల్ఫీలు , ఫోటోలను తీయడానికి 48 మెగాపిక్సెల్ మెయిన్, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో వస్తున్న 15000 లోపు బెస్ట్ ఫోన్లలో ఒకటి.
 
6000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై కొత్త నేజ్, మ్యాట్ డిజైన్ లో లభిస్తుంది. శాంసంగ్ ఎం12 మొబైల్ ధర: రూ. 13,999
 
రెడ్ మీ నోట్ 11 (4 జీబీ ర్యామ్, 64 జీబీ)
రెడ్ మీ నోట్ 11 స్మార్ట్ ఫోన్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ స్పేస్ తో వచ్చిన బెస్ట్ రెడ్ మీ ఫోన్లలో ఇది ఒకటి.
 
5000 ఎంఏహెచ్ బ్యాటరీతో మొబైల్ ఫోన్లో మీకు ఇష్టమైన షోను చూడటంతో పాటు ఆన్ లైన్ లో ఎక్కువ గేమ్స్ ఆడవచ్చు. రెడ్ మీ నోట్ 11 మొబైల్ ధర: రూ. 12,999.
 
రియల్ మీ 10 (రష్ వైట్ 64 జీబీ, 4 జీబీ ర్యామ్)
4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ తో వచ్చిన ఈ రియల్ మీ 10 స్మార్ట్ ఫోన్లు 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో మంచి క్వాలిటీ సెల్ఫీలు, ఫొటోలు తీసుకోవచ్చు. 
 
రియల్ మీ 10 బెస్ట్ బడ్జెట్ మొబైల్ ఫోన్లలో ఇది ఒకటి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్ ఫోన్ లో ఎక్కువ పని చేయడానికి, చూడటానికి వీలు కల్పిస్తుంది. రియల్ మీ 10 మొబైల్ ధర: రూ.14,999  
 
పోకో ఎం5 (పవర్ బ్లాక్, 64 జీబీ, 4 జీబీ ర్యామ్)
భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్ ఫోన్ బ్రాండ్లలో పోకో ఒకటి, ఈ పోకో ఎం 5 అద్భుతమైన సెల్ఫీలు, ఫోటోలను తీయడానికి 50 మెగాపిక్సెల్ మెయిన్, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ప్రీమియం లెదర్ లాంటి ఆకృతితో వచ్చే 15000 లోపు బెస్ట్ మొబైల్ ఇది. 
 
4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉండటంతో ఈ ధరల శ్రేణిలో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్ ఫోన్లలో ఒకటిగా నిలిచింది. పోకో ఎం5 మొబైల్ ధర: రూ.10,799.
 
రియల్ మీ సీ35 (4జీబీ ర్యామ్, 64జీబీ)
వేగవంతమైన, సున్నితమైన పని అనుభవం కోసం యునిసోక్ టైగర్ టి 616 ప్రాసెసర్ తో వచ్చిన మరో రియల్మీ సి 35 మొబైల్ ఫోన్ ఇక్కడ ఉంది. 50 మెగాపిక్సెల్ రియర్, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో మంచి క్వాలిటీ సెల్ఫీలు, ఫొటోలు దిగొచ్చు.
 
ఇది 15000 లోపు ఉన్న అత్యుత్తమ మొబైల్ లలో ఒకటి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఎక్కువ సేపు పనిచేయడానికి వీలు కల్పిస్తుంది. రియల్ మీ సీ35 మొబైల్ ధర: రూ.11,880 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రన్నింగ్ కారులో రొమాన్స్ - పోకిరీ జంట కోసం గాలింపు