ఉద్యోగులకు షాకివ్వనున్న కాగ్నిజెంట్... 7 వేల మంది టెక్కీలకు ఉద్వాసన?!

Webdunia
గురువారం, 31 అక్టోబరు 2019 (20:21 IST)
దేశంలోని సాఫ్ట్‌వేర్ దిగ్గజ కంపెనీల్లో కాగ్నిజెంట్ ఒకటి. తమ వద్ద పని చేసే టెక్కీలకు ఈ కంపెనీ తేరుకోలేని షాకిచ్చింది. వచ్చే రాబోయే త్రైమాసికంలో సుమారుగా ఏడు వేల మంది టెక్కీలను తొలగించనున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత మరో ఆరు వేల మంది ఉద్యోగులపై వేటు వేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. 
 
అమెరికాకు చెందిన ఈ కంపెనీ కంటెంట్ మోడరేషన్ బిజినెస్ నుంచి తప్పుకోబోతున్నట్టు ప్రకటించింది. ఈ కారణంగానే కఠిన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే, కంపెనీ నుంచి తొలి దశలో తొలగించాలని భావిస్తున్న ఐదు వేల మందిని మళ్లీ తీసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. 
 
వారికి కొత్తగా మళ్లీ శిక్షణ ఇచ్చి.. ఇతర స్థాయి ఉద్యోగాల్లో నియమించే అవకాశం ఉంది. అంటే.. మొత్తం మీద దాదాపు 7000 మంది ఉద్యోగులకు కాగ్నిజెంట్ షాక్ ఇవ్వబోతున్నట్లు అర్థమవుతోంది. ఇదేగానీ జరిగితే.. కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 2 శాతం మందిని తొలగించినట్లు అవుతుంది. నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకునే ఉద్దేశంతో కూడా కాగ్నిజెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించినవేనా?

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్లన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

Dharma Mahesh: హీరో ధర్మ మహేష్ ప్రారంభించిన జిస్మత్ జైల్ మందీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments