Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా భద్రతకు ముప్పు.. అందుకే యాప్‌లపై నిషేధం : చైనాకు భారత్ సమాధానం

Webdunia
సోమవారం, 13 జులై 2020 (18:09 IST)
జాతీయ సార్వభౌమాధికారం, భద్రతకు ముప్పు ఉందన్న కారణంగానే చైనాకు చెందిన 59 యాప్‌లపై నిషేధం విధించినట్టు భారత్ మరోమారు స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని చైనా దౌత్యాధికారులకు కూడా సూటిగా చెప్పేసింది. 
 
గాల్వాన్ లోయ వివాదం తర్వాత సోషల్ మీడియా వేదికలపై విస్తృతంగా వినియోగంలో ఉన్న టిక్ టాక్, హలో సహా 50 చైనా మొబైల్ యాప్‌లను గత జూన్ 29న భారత్ నిషేధించిన విషయం తెల్సిందే. 
 
ఈ క్రమంలో తమ దేశానికి చెందిన 59 మొబైల్ యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన అంశాన్ని ఇటీవల న్యూఢిల్లీతో జరిపిన చర్చల్లో చైనా ప్రస్తావించింది. దౌత్య స్థాయిలో జరిగిన సమావేశంలో తమ మొబైల్ అప్లికేషన్లను నిషేధించడంపై చైనా ప్రశ్నించినట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. 
 
ఇందుకు భారత్ ధీటుగా సమాధామిచ్చిందనట్టు తెలుస్తోంది. ముఖ్యంగా, భద్రతాంశాల దృష్ట్యా ఈ చర్య తీసుకున్నామని, తమ పౌరుల డాటాకు సంబంధించిన అంశాల్లో రాజీపడే ప్రసక్తి లేదని తేల్చిచెప్పిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 
 
దేశంలోని యూజర్ డాటాను సేకరించి, దానిని బయటకు పంపించే అవకాశాలున్నాయని ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సమాచారంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69ఏ కింద ఈ చర్య తీసుకున్నట్టు కూడా కేంద్రం ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే ఒక్క రీల్స్‌కు ఏకంగా 190 కోట్ల వీక్షణలు...

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments