Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చైనాకు మరో షాక్? 350 విదేశీ వస్తువులపై బ్యాన్?

చైనాకు మరో షాక్? 350 విదేశీ వస్తువులపై బ్యాన్?
, సోమవారం, 13 జులై 2020 (10:30 IST)
చైనాపై భారత్ మరోమారు కన్నెర్రజేసింది. గాల్వాన్ లోయలో చైనా బలగాల బరితెగింపునకు నిరసనగా చైనాకు చెందిన 59 యాప్స్‌పై భారత్ నిషేధం విధించింది. ఇందులో అత్యంత ప్రజాధారణ పొందిన టిక్ టాక్ యాప్ కూడా ఉంది. దీంతో చైనా యాప్ కంపెనీలు భారీగా నష్టపోయాయి. ఈ క్రమంలో చైనాకు భారత్ మరోమారు షాకిచ్చింది. మొత్తం 350 రకాల విదేశీ వస్తువులపై భారత్ నిషేధం విధించింది. 
 
ఇవన్నీ చైనా కంపెనీలు ఉత్పత్తి చేసే వస్తువులే కావడం గమనార్హం. తాజాగా నిషేధం విధించిన వస్తువులలో ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, టాయ్స్, ఫర్నీచర్ తదితర వస్తువులు ఉన్నాయి. ఇకపై భారత్ నిషేధం విధించిన వస్తువులను దిగుమతి చేసుకోవాలంటే పలు రకాలైన ఆంక్షలను అధికమించాల్సిందే. 
 
ఇప్పటికే చైనా వస్తువుల వల్ల దేశ భద్రకు ముప్పు వాటిల్లుతోందని రక్షణ రంగ నిపుణులు పదేపదే హెచ్చరిస్తూ వస్తున్నారు. ఇందులోభాగంగా, చైనాకు చెందిన 59 రకాల యాప్స్‌పై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ బాటలో అగ్రరాజ్యం అమెరికా కూడా నడువనుంది. ఇపుడు మరో 350 రకాల వస్తువులపై నిషేధం విధించడంతో చైనా కంపెనీలకు అతిపెద్ద మార్కెట్ కలిగిన దేశాల్లో భారత్‌ను కోల్పోవాల్సివచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముందుగా అవసరమైన ప్రజలకు కరోనా వ్యాక్సిన్‌: బిల్‌గేట్స్