Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాపిల్ సంస్థ నుండి స్ట్రీమింగ్ వీడియో సర్వీసెస్ రానున్నాయి..

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (13:37 IST)
ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ ఈ నెల 25వ తేదీన ఓ స్పెష‌ల్ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌నుంది. ఈ మేరకు యాపిల్ తాజాగా ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ స్పెషల్ ఈవెంట్ ఎందుకోసం అనే వివరాలను మాత్రం యాపిల్ వెల్లడించలేదు. కానీ అందులో యాపిల్ త‌న సొంత స్ట్రీమింగ్ వీడియో సర్వీస్‌ను లాంచ్ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది. ఈవెంట్‌కి సంబంధించి ఇట్స్ షో టైం అనే ట్యాగ్‌లైన్‌ను యాపిల్ జ‌త‌చేసింది. దీన్ని బట్టి చూస్తే యాపిల్ ఖచ్చితంగా వీడియో స్ట్రీమింగ్ సర్వీసెస్‌ను లాంచ్ చేయనుందని తెలుస్తోంది.
 
కాగా ఈ ఈవెంట్‌లో యాపిల్ ఎలాంటి హార్డ్‌వేర్ ప్రొడక్ట్స్‌ను విడుదల చేయడం లేదని సమాచారం. గ‌తేడాది యాపిల్ నెక్ట్స్ ఇష్యూ మీడియాకు చెందిన టెక్ట్చ‌ర్ అనే డిజిట‌ల్ మ్యాగ‌జైన్ స‌ర్వీస్‌ను సొంతం చేసుకోగా, అందుకోసం వినియోగదారుల నుండి నెలకు 10 డాల‌ర్ల స‌బ్‌స్క్రిప్ష‌న్ ఫీజును వసూలు చేస్తోంది. ఈ క్ర‌మంలో స‌ద‌రు చార్జీని ప‌బ్లిష‌ర్ల‌కు రెవెన్యూ రూపంలో యాపిల్ ఇవ్వ‌నుంద‌ని తెలిసింది. ఇక మార్చి 25 ఈవెంట్ యాపిల్ పార్క్ క్యాంప‌స్‌లో ఉన్న స్టీవ్ జాబ్స్ థియేట‌ర్‌లో భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 10.30 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments