Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టిక్‌ టాక్‌ యాప్‌ను నిషేధించండి.. తమిళనాడు సర్కార్ డిమాండ్

టిక్‌ టాక్‌ యాప్‌ను నిషేధించండి.. తమిళనాడు సర్కార్ డిమాండ్
, బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (11:00 IST)
సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో సెల్ఫీల పిచ్చి, డబ్ స్మాష్‌ల పిచ్చి బాగా ముదిరిపోతుంది. డబ్ స్మాష్‌లు చేసి, డ్యాన్సులేసి, మిమిక్రీ చేసి సదరు వీడియోలను టిక్ టాక్ యాప్‌లో పోస్టు చేయడం ఫ్యాషనైపోయింది. ఇలాంటి యాప్‌లు బోలెడున్నా.. టిక్ టాక్‌కు ప్రస్తుతం మంచి క్రేజ్ వచ్చింది.


అయితే ఈ మధ్య అభ్యంతరకర వ్యాఖ్యలతో, అశ్లీల సంభాషణలతో టిక్ టాక్‌లో వీడియోలు అప్ లోడ్ అవుతున్నాయి. తద్వారా భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్న ఈ టిక్ టాక్‌ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తమిళనాడు ఐటీ మంత్రి మణికంఠన్ చెప్పారు. 
 
టిక్‌టాక్‌ యాప్‌ను నిషేధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, దీనిపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చ సందర్భంగా మనిదనేయ జననాయగ కట్చి నాగపట్టణమ్‌ ఎమ్మెల్యే తమ్మున్‌ హన్సారీ మాట్లాడుతూ ... టిక్‌టాక్‌ యాప్‌లో అశ్లీల చిత్రాలు, పలు వర్గాలు, మతాల మధ్య హింసను ప్రేరేపించే సంభాషణలు అధికంగా ఉన్నాయన్నారు. 
 
ఆపై మంత్రి మణికంఠన్‌ సమాధానమిస్తూ, యాప్‌‌ను నిషేధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హింసను ప్రేరేపించే సంభాషణలు ఇందులో వున్నాయని గుర్తు చేశారు. ఇంకా రాజకీయ నేతలకు సంబంధించిన ప్రసంగాలను పోస్టు చేస్తూ.. వాటికి సెటైరికల్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ యాప్ వ్యక్తిగతంగా వాడుకునేందుకు రూపొందించబడిందని.. కానీ యూజర్లు.. వివాదాస్పద కామెంట్లు చేస్తూ వీడియోలు పోస్టు చేస్తున్నారని తమిళనాడు సర్కార్ వెల్లడించింది. 
 
ఇకపోతే.. టిక్ టాక్‌లో 2018లో విడుదలైన తెలుగు సినిమా గీత గోవిందంలోని ఇంకేం ఇంకేం కావాలి పాట, తమిళంలో ధనుష్, సాయిపల్లవిల మారి2లోని రౌడీ బేబీ పాటకు మీమ్స్, డబ్ స్మాష్‌లు, డ్యాన్సుల వీడియోలు టిక్ టాక్‌లో బాగా పేలుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేసవి కాదు.. ఎండల కొలిమి.. కాదు కాదు.. ఎండల ఉప్పెన వచ్చేస్తోంది..