Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్మశానంలో మండే మృతదేహం.. నరుక్కుతినే.. నరరూప రాక్షసుడి పట్టేశారు..?

Advertiesment
శ్మశానంలో మండే మృతదేహం.. నరుక్కుతినే.. నరరూప రాక్షసుడి పట్టేశారు..?
, బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (18:36 IST)
చితిపేర్చి నిప్పు పెట్టిన మృతదేహాన్ని నరుక్కుని తినే నరరూప రాక్షసుడి వ్యవహారం తమిళనాడు సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే.. తిరునల్వేలి జిల్లా, వాసుదేవనల్లూరుకు సమీపంలో రామనాథపురం అనే గ్రామం వుంది. ఈ గ్రామానికి చెందిన కనకసభాపతి కుమారుడు మురుగేశన్ (43). ఇతనికి భార్య, ఓ కుమార్తె, ఓ కుమారుడు వున్నారు. 
 
మురుగేశన్‌కు గంజాయి, మద్యం సేవించడం వంటి చెడు అలవాట్లున్నాయి. దీనిపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవులు జరిగేవి. దీంతో భర్తకు దూరమైన మురుగేశన్ భార్య.. తన సంతానంతో పుట్టింటికి వెళ్ళిపోయింది.

ఈ నేపథ్యంలో గత కొన్ని వారాలుగా రామనాథపురంలోని శ్మశాన వాటికలో చితి పెట్టి మండిపోయిన మృతదేహాలను భుజించి వెళ్తున్నట్లు గ్రామ ప్రజలకు తెలియవచ్చింది. దీంతో గ్రామ ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల ఆ గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. 
 
ఆమె భౌతికకాయానికి అంత్యక్రియలు పూర్తయ్యాక చితి పేర్చి నిప్పంటించారు. బంధువులు శ్మశాన వాటిక నుంచి వెనుదిరిగారు. అయితే ఇలా నిప్పంటించిన మృతదేహాలను తినే నరరూప రాక్షసుడు ఎవరనేది కనిపెట్టేందుకు శ్మశానంలోనే చాటుగా గ్రామస్తులు నిలిచారు. ఆ సమయంలో చేతిలో కొడవలితో వచ్చిన మురుగేశన్.. మృతదేహాన్ని నరికి తినడం చూసి షాకయ్యారు. 
 
ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మానవ మాంసాన్ని తినే మృగాన్ని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ఇంకా అతడి మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడానికి తోడు.. దర్యాప్తుకు మురుగేశన్ సహకరించకపోవడంతో చెన్నై కీల్పాక్కం మానసిక వైద్యశాలకు తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బైబిల్.. ఆ బాలుడి పట్ల శాపమైంది.. శవపేటికలో పెట్టి సజీవదహనం..?