Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీతో పాటు నేను కూడా పండుకుంటా.. అంటూ వచ్చిన పైథాన్.. (Video)

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (13:07 IST)
థాయ్‌లాండ్‌లో ఓ కొండ చిలువ పాము ఏకంగా బెడ్‌రూమ్‌లోకి వచ్చేసింది. 75 ఏళ్ల బామ్మగారు సుదోసోపా మాంచి నిద్రలో ఉన్నారు. ఇంతలో ఆమె నిద్రిస్తున్న మంచం దగ్గరికి కొండ చిలువ ఎక్కడి నుంచో వచ్చేసింది. గాఢ నిద్రలో ఉన్న బామ్మ దానిని చూసే ఛాన్స్ లేకపోయింది. అయితే ఈ క్రమంలో పైథాన్ బామ్మ కాలుని తాకింది. అంతే బామ్మ ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచింది. 
 
మొదటగా బామ్మ దానిని ఏదో పురుగు అనుకుంది. కానీ ఎందుకైనా మంచిదని టార్చ్‌లైట్ వేసి చూడగా, పాము పాకుతున్నట్లు కనిపించింది. వెంటనే అప్రమత్తమైన బామ్మ పక్కగదిలో ఉన్న కొడుకు నక్రోన్‌ని పిలిచింది. అతడు వచ్చి లైట్లన్నీ వేసి చూసే సరికి పెద్ద కొండ చిలువ పాము కనిపించింది.

దాన్ని అక్కడి నుండి తరమగా బయట ఉన్న బాత్‌రూమ్‌లోకి దూరింది. ఇంతలో సమాచారం అందుకున్న రెస్క్యూ టీం రంగంలోకి దిగి కొండ చిలువను పట్టుకుని అడవుల్లో విడిచిపెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్‌లో వైరల్‌గా మారింది.  
 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments