Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో మరో మూడు నెలల్లో 5జీ సేవలు.. అన్నీ అనుకూలిస్తే..?

Webdunia
గురువారం, 11 మార్చి 2021 (17:00 IST)
భారతదేశంలో మరో మూడు నెలల్లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. అవసరమైన మౌళిక సదుపాయాలు, ఆప్టికల్ ఫైబర్ ఇన్‌ప్రాస్ట్రక్చర్ సిద్ధం చేసుకుంటే 5 జీ అందుబాటులో రావచ్చు. లేదా మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది. 
 
ఇండియాలో 5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి ఎప్పుడొస్తుందనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే 5జీ నెట్‌వర్క్‌కు కావల్సిన మౌలిక సదుపాయాల కల్పన అడ్డంకిగా మారింది. టెక్నాలజీకి కీలకమైన ఫైబర్ ఆధారిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంకా సిద్ధం కాలేదు. ఈ నేపథ్యంలో 5జీ ప్రారంభించినా కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయాల్సి వస్తుందని టెలికం పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. 
 
5జీ అందుబాటులో తెచ్చేందుకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనపై ఇండియా సత్వరం నిర్ణయం తీసుకోవాలని అంటున్నాయి. లేకుంటే కొత్త తరం టెక్నాలజీ ప్రయోజనాల్ని అందిపుచ్చుకోలేమని నోకియా ఇండియా తెలిపింది. 
 
5జీ నెట్‌వర్క్‌ను కేవలం ఆపరేటర్ల వ్యాపారంగా భావించకూడదని.. దేశానికి ప్రపంచానికి ఆర్థికపరమైన ప్రయోజనాలు చేకూర్చేందుకు ఇది చాలా అవసరమని చెప్తోంది. ఇండియాలో 5జీ సిద్ధం చేస్తున్నామని.. పరిస్థితులన్నీ అనుకూలిస్తే 3 నెలల్లోనే వినియోగంలో తీసుకురావచ్చని అంటున్నాయి టెలీకం కంపెనీలు.

సంబంధిత వార్తలు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments