Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నటి కిడ్నాప్ కేసు.. విచారణ మరో 6 నెలలు పొడిగింపు

Advertiesment
నటి కిడ్నాప్ కేసు.. విచారణ మరో 6 నెలలు పొడిగింపు
, మంగళవారం, 2 మార్చి 2021 (20:49 IST)
ప్రముఖ మలయాళ నటుడు, సూపర్ స్టార్ దిలీప్.. గత 2019వ సంవత్సరం టాప్ హీరోయిన్ కిడ్నాప్ కేసులో అరెస్టయ్యారు. ఈ కేసు విచారణకు అత్యున్నత న్యాయస్థానం మరో ఆరు నెలల పాటు సమయాన్ని పొడిగించింది. ఈ కేసు కేరళలోని ఎర్నాకుళం అదనపు స్పెషల్ సెషన్స్ కోర్టులో గత 2019వ సంవత్సరం నుంచి విచారణ జరుగుతోంది. 
 
అయితే ఈ కోర్టు సుప్రీం కోర్టు నిర్దేశించిన సమయంలోపు విచారణను పూర్తి చేయలేకపోయింది. కరోనా కారణంగా కేసు విచారణలో జాప్యం ఏర్పడింది. అందుచేత ఆరు నెలల పాటు సమయాన్ని పొడిగించాలని స్పెషల్ కోర్టు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 
 
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. హైకోర్టు ఈ కేసు విచారణకు ఆరునెలల పాటు సమయం ఇచ్చింది. ట్రయల్ ప్రొసీడింగ్స్ పూర్తి చేయడానికి కేరళలోని ఎర్నాకుళం అదనపు స్పెషల్ సెషన్స్ జడ్జి నుండి 2021 జనవరి 16 నాటి అభ్యర్థన మేరకు ఈ ఉత్తర్వు వచ్చింది. క్రిమినల్ ప్రొసీడింగ్స్ పూర్తి చేయడానికి గడువును సుప్రీం కోర్టు ఇంతకుముందు ఆరు నెలలు పొడిగించింది. 2021 ఫిబ్రవరి 4 లోగా విచారణ పూర్తి చేయాలని కోర్టును కోరింది
 
కరోనా మహమ్మారి, ఇతర అనివార్య కారణాల చేత విచారణ ఆలస్యం అయింది. ఈ కేసులో జాబితా చేయబడిన దాదాపు 300 మంది సాక్షులలో 82 మందిని మాత్రమే ప్రాసిక్యూషన్ పరిశీలించగలిగింది. దీంతో విచారణను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ సుప్రీం ఉత్తర్వులు జారీ చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్‌టిఆర్‌ కొత్త సినిమా కోసం క‌స‌ర‌త్తు!