సురేశ్ రైనా సంచలన వ్యాఖ్యలు.. టీమ్‌లో ఏం జరిగింది..?

Webdunia
శనివారం, 2 జనవరి 2021 (11:37 IST)
ఐపీఎల్-2020లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ సురేశ్ రైనా ఆడని సంగతి తెలిసిందే. ఈ టోర్నీ నుంచి రైనా అర్ధాంతంగా తప్పుకున్నాడు. టోర్నీలో ఆడేందుకే దుబాయ్ వెళ్లిన రైనా.. అది మొదలు కాకముందే తిరిగి ఇండియాకు వచ్చేశాడు. అయితే తాను ఐపీఎల్ ఎందుకు ఆడలేదన్నదానిపై ఎన్నో పుకార్లు వచ్చినా ఇన్నాళ్లూ నోరు మెదపని రైనా.. తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
 
ఆడకపోవడానికి కారణాన్ని నేరుగా చెప్పలేదు కానీ.. టీమ్‌లో ఏదైనా జరిగిందా అన్న అనుమానం కలిగేలా రైనా మాట్లాడాడు. మనం సంతోషంగా లేకపోతే వెనక్కి వచ్చేయాలన్నదే తన ఆలోచన అంటూ చెప్పుకొచ్చాడు. ఏదో ఒత్తిడితో ఏదో అయిపోదు. క్రికెటర్లు సహజంగానే తమకు తాము టీమ్ కంటే ఎక్కువని ఫీలవుతుంటారు. ఒకప్పుడు సినిమా నటులు ఇలా ఉండేవారు అని అవుట్‌లుక్‌తో ఇంటర్వ్యూలో రైనా అనడం విశేషం. 
 
ఇక ఐపీఎల్‌లో ఆడకపోవడం వల్ల తానేమీ బాధపడటం లేదని, తన పిల్లలు, కుటుంబంతో గడపడం సంతోషంగా ఉందని రైనా చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో కుటుంబానికి తాను అవసరమని తెలిపాడు.
 
''20 ఏళ్లుగా నేను ఆడుతున్నా. కానీ అవసరమైన సమయంలో కుటుంబానికి మనం అందుబాటులో ఉండాలి. అందుకే ఆ సమయంలో ఐపీఎల్‌లో ఆడకుండా వెనక్కి వచ్చేయడమే సరైనదని నాకు అనిపించింది" అని రైనా అన్నాడు. అయితే దుబాయ్ హోటల్‌లో రైనా బాల్కనీ ఉన్న రూమ్ కోసం అడిగాడని, అది కుదరకపోవడంతో అసంతృప్తి వల్లే తిరిగి ఇండియాకు వచ్చాడన్న వార్తలు వచ్చాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Live Cockroach in Heart: గుండెలో బతికే వున్న బొద్దింక.. అమెరికాకు వెళ్లిన పెద్దాయన.. ఎందుకు?

పరకామణి దొంగతనం కేసు.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నివేదికను సమర్పించిన సిట్

పెట్టుబడుల కోసం అమెరికాలో పర్యటించనున్న నారా లోకేష్

అత్తగారింట్లో అడుగుపెట్టిన అర గంటకే విడాకులు - కట్నకానుకలు తిరిగి అప్పగింత

Karnataka: 13 ఏళ్ల బాలికను చెరకు తోటలోకి లాక్కెళ్లి అత్యాచారం.. నిందితుడి అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

తర్వాతి కథనం
Show comments