Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీశాంత్‌కు మళ్లీ బంతి పట్టే అవకాశం.. వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు

Advertiesment
Suresh Raina
, బుధవారం, 2 డిశెంబరు 2020 (10:42 IST)
కేరళ స్పీడ్ స్టర్ శ్రీశాంత్ మళ్లీ బంతి పట్టుకోనున్నాడు. ఏడేళ్ల నిషేధం తర్వాత క్రికెట్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. కేరళ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ప్రెసిడెంట్స్ కప్ టీ20 టోర్నమెంటులో శ్రీశాంత్ ఆడనున్నాడు. దీంతో మళ్ళీ బంతితో మయా చేయడానికి సిద్ధమవుతున్నాడు.

అందుకోసం ప్రెసిడెంట్స్ కప్ టీ 20 టోర్నీ వేదికగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వచ్చేనెల 17న ఈ టోర్ని మెుదలుకానుంది. ఈ బిగ్ టోర్నిలో కేసీఏ రాయల్స్, కేసీఏ టైగర్స్, కేసీఏ టస్కర్స్, కేసీఏ ఈగల్స్, కేసీఏ పాంథర్స్, కేసీఏ లయన్స్ జట్లు పోటి పడనున్నాయి. 
 
ఈ టోర్నీలో ఏడేళ్ల తర్వాత మళ్ళీ క్రికెట్ ఆడుతున్నానని.. సంతోషాన్ని వ్యక్తం చేస్తూ శ్రీశాంత్ ట్విటర్ ద్వారా తన హర్షం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా శ్రీశాంత్‌కు మాజీ క్రికెటర్ సురేశ్ రైనా శుభాకాంక్షలు తెలిపాడు.
 
ఏడేళ్ల తర్వాత మళ్లీ బంతిని తిప్పే అవకాశం వచ్చిందని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. అమితంగా ఇష్టపడే క్రికెట్‌లో అత్యుత్తమంగా రాణించేందుకు ప్రయత్నం చేస్తున్నానని ట్వీట్ చేశాడు. శ్రీశాంత్ చేసిన ట్వీట్‌పై సురేశ్ రైనా స్పందించారు. 'గుడ్ లక్ మై బ్రదర్' అంటూ శ్రీశాంత్‌ను విషెస్ తెలియజేశాడు. స్పాట్ ఫిక్సింగ్ కారణంగా శ్రీశాంత్‌పై బీసీసీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 
 
2013 ఐపీఎల్‌లో అతని ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరొపణలు వచ్చాయి. ఆ సమయంలో రాజస్థాన్ రాయల్స్‌ జట్టు తరుపున ఆడుతున్న శ్రీశాంత్‌పై నిషేదం విధించారు. అతనితో పాటు అజిత్ చండేలా, అంకిత్ చవాన్‌లను కూడా బ్యాన్ చేశారు. ఈ ఘటనపై పలు సార్లు శ్రీశాంత్‌ ఆప్పీల్ చేసుకున్నప్పటికి ఎలాంటి సానుకూలంగా ఫలితం లేకపోయింది. అతని విన్నపాన్ని పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ గత సంవత్సరం అతని నిషేదాన్ని ఏడేళ్లకు కుదించారు. సెప్టెంబరుతో ఆ బ్యాన్ ముగిసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోహ్లీ సేనకు పరువు దక్కేనా.. కంగారులు క్లీన్ స్వీప్ చేసేనా?