Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పబ్‌లో సురేష్ రైనా ఏం చేశాడు..? హృతిక్ రోషన్ మాజీ భార్యను కూడా..?

Advertiesment
పబ్‌లో సురేష్ రైనా ఏం చేశాడు..? హృతిక్ రోషన్ మాజీ భార్యను కూడా..?
, బుధవారం, 23 డిశెంబరు 2020 (10:47 IST)
చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాడు సురేశ్‌రైనాను ముంబై పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. ముంబై విమానాశ్రయం సమీపంలోని ఓ పబ్‌లో రైనాను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. కరోనా నియమాలు పాటించకపోవడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా పబ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో దాడులు చేసినట్టు పోలీసులు చెప్పుకొచ్చారు.
 
రైనాతో పాటు పబ్‌లో ఉన్న మరో 34 మందిని కూడా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించిన తర్వాత బెయిల్‌పై విడుదల చేసినట్టు సమాచారం. సురేష్ రైనాతో పాటు సింగర్ గురు రంధవ, బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ సహా మొత్తం 34 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు తరలించిన అనంతరం బెయిల్ మీద కొందరిని విడుదల చేసినట్లు సమాచారం.  
webdunia
Hrithik Roshan - Sussanne Khan
 
ఇక సురేష్ రైనా విషయానికి వస్తే.. ఈ ఏడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు రైనా గుడ్‌బై చెప్పాడు. మిత్రుడు, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన అరగంటలోనే రైనా కూడా అదే బాట పట్టడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓ ఇంటివాడైన భారత క్రికెట్ జట్టు లెగ్ స్పిన్నర్