ఔరా.. క్యాచ్ పట్టావా.. చెట్టుమీదున్న మామిడి పండును తెంపినావా? (వీడియో)

ఐపీఎల్ 2018 మ్యాచ్‌లో ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. అయితే, అతి తక్కువ స్కోర్లు చేసినప్పటికీ.. ప్రత్యర్థి జట్టుకు గెలుపు అవకాశాలు లేకుండా చేయడంలో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు ఆరితేరింది. ఈ కోవలోనే సోమవారం

Webdunia
మంగళవారం, 8 మే 2018 (14:43 IST)
ఐపీఎల్ 2018 మ్యాచ్‌లో ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. అయితే, అతి తక్కువ స్కోర్లు చేసినప్పటికీ.. ప్రత్యర్థి జట్టుకు గెలుపు అవకాశాలు లేకుండా చేయడంలో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు ఆరితేరింది. ఈ కోవలోనే సోమవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుతో జరిగిన మ్యాచ్ సాగింది.
 
బెంగళూరుపై 146 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకొని ప్లేఆఫ్స్ చేరిన తొలి టీమ్‌గా నిలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో వెటరన్ ప్లేయర్ యూసుఫ్ పఠాన్ ఒంటిచేత్తో పట్టిన క్యాచ్ ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసింది. ఆ వికెట్ కూడా సాధారణ వ్యక్తిది కాదు. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లిది. అప్పటికే అతను జోరు మీదున్నాడు. కోహ్లి ఇంకాసేపు క్రీజులో ఉంటే ఆర్సీబీ సునాయాసంగా గెలిచివుండేది. 
 
ఆ సమయంలో ష‌కీబుల్ హ‌స‌న్‌ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడటానికి కోహ్లీ యత్నించాడు. షార్ట్ థర్డ్‌మ్యాన్ పొజిషన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న యూసుఫ్ పఠాన్ గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో సింపుల్‌గా క్యాచ్ పట్టేశాడు. అది చూసి అందరూ షాక్ తిన్నారు. చూడటానికి సింపుల్‌గా కనిపిస్తున్నా ఈ సీజన్ బెస్ట్ క్యాచుల్లో ఇదీ ఒకటి అని చెప్పొచ్చు. ఈ క్యాచ్‌ను పలువురు ప్రశంసిస్తున్నారు కూడా. అలాగే, యూసుఫ్ త‌మ్ముడు ఇర్ఫాన్ కూడా ట్విట్ట‌ర్‌లో స్పందించాడు. క్యాచ్ ప‌ట్టిన‌వా.. చెట్టు మీదున్న మామిడి పండు తెంపిన‌వా అంటూ ఇర్ఫాన్ చ‌మ‌త్క‌రించాడు. ఆ వీడియోను మీరూ చూడండి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర... రాజోలులో రెక్కీ సక్సెస్

తీవ్రరూపం దాల్చిన దిత్వా తుపాను - ఏపీలో అత్యంత భారీ వర్షాలు

తాగుబోతు భర్త వేధింపులు.. భరించలేక హత్య చేసిన భార్య

Pawan Kalyan: అమరావతి అభివృద్ధికి కేంద్రం అమూల్యమైన మద్దతు.. పవన్ కల్యాణ్

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

తర్వాతి కథనం
Show comments