Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2018 : ప్లేఆఫ్ మ్యాజిక్... 8 జట్ల మధ్య గట్టిపోటి

స్వదేశంలో గతకొన్ని రోజులుగా సందడి చేస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదకొండో దశ (ఐపీఎల్ 2018) పోటీలు ఇపుడు ముఖ్య ఘట్టానికి చేరుకోనున్నాయి. మొత్తం 8 జట్లు ప్లేఆఫ్ దశలోకి నాలుగు జట్లు మాత్రమే అర్హత సాధించ

Webdunia
మంగళవారం, 8 మే 2018 (12:33 IST)
స్వదేశంలో గతకొన్ని రోజులుగా సందడి చేస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదకొండో దశ (ఐపీఎల్ 2018) పోటీలు ఇపుడు ముఖ్య ఘట్టానికి చేరుకోనున్నాయి. మొత్తం 8 జట్లు ప్లేఆఫ్ దశలోకి నాలుగు జట్లు మాత్రమే అర్హత సాధించనున్నాయి. ఇందులో టాప్-4 స్థానాలను కైవసం చేసుకునేందుకు అన్ని జట్లూ పోటీపడుతున్నాయి. అందువల్ల మిగిలిన మ్యాచ్‌లలో గెలుపొందేందుకు తమ శక్తియుక్తులను ప్రదర్శించనున్నాయి.
 
ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో ఒక్క పంజాబ్, రాజస్థాన్ జట్లు మినహా మిగిలిన జట్లన్నీ పదేసి మ్యాచ్‌లను ఆడాయి. వీటిలో హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్, కోల్‌కతా జట్లు వరుసగా టాప్-4 స్థానాల్లో ఉన్నాయి. ముంబై, బెంగుళూరు, ఢిల్లీ, రాజస్థాన్ జట్లు పాయింట్ల పరంగానేకాకుండా, నెట్ రన్‌రేట్ పరంగా కూడా తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
 
అయితే, ఐపీఎల్ కప్‌ను రెండుసార్లు ఎగరేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పాయింట్లు, రన్‌రేట్ పరంగా కూడా రెండో స్థానంలో ఉంది. ఈ జట్టు మొత్తం 10 మ్యాచ్‌లు ఆడి... మూడు మ్యాచ్‌లలో ఓడి, ఏడు మ్యాచ్‌లలో గెలుపొంది 14 పాయింట్లతో ఉంది. ఇక సన్‌రైజరస్స్ హైదరాబాద్ జట్టు ఏకంగా 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దీంతో ఈ రెండు జట్లు ప్లేఆఫ్‌కు అర్హత సాధించగా, మిగిలిన రెండు స్థానాలకు పంజాబ్, కోల్‌కతా, ముంబై, బెంగుళూరు, ఢిల్లీ, రాజస్థాన్ జట్లు పోటీపడుతున్నాయి. వీటిలో పంజాబ్, కోల్‌కతా జట్లకే అధిక అవకాశాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Maharshtra: ఎంబీబీఎస్ స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం.. జ్యూస్ ఇచ్చి ఫ్లాటులో?

మాకు నీటిని ఆపితే.... మేము మీ శ్వాసను ఆపేస్తాం : భారత్‌కు పాకిస్థాన్ హెచ్చరిక

భీమవరం బుల్లోడు బ్రిటన్ ఉప మేయర్ అయ్యాడు.. ఎలా?

అతివేగంగా చెట్టును ఢీకొట్టిన కారు రెండు ముక్కలైంది: ముగ్గురు మృతి

ఏపీలో మరో కరోనా పాజిటివ్ కేసు... క్రమంగా పెరుగుతున్న కేసులు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: స్టేజ్‌పై సమంత- చిరునవ్వుతో చప్పట్లు కొట్టిన అక్కినేని అమల (వీడియో)

మైసూర్ సబ్బుకు ప్రచారకర్తగా తమన్నా అవసరమా? కర్నాటకలో సెగ!!

Tamannah: మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా తమన్నా.. కన్నడ హీరోయిన్లు లేరా?

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

తర్వాతి కథనం
Show comments