Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌లో సిక్సర్ల మొనగాడు ఎవరు?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ ప్రారంభమై దశాబ్దంకాలం ముగిసిపోయింది. ఇపుడు 11వ యేటలోకి అడుగుపెట్టింది. అంటే ప్రస్తుతం ఐపీఎల్ పదకొండో సీజన్ జరుగుతోంది. అయితే, ఈ టోర్నీలో వివిధ దేశాలకు చెందిన స్ట

Webdunia
బుధవారం, 18 ఏప్రియల్ 2018 (18:41 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ ప్రారంభమై దశాబ్దంకాలం ముగిసిపోయింది. ఇపుడు 11వ యేటలోకి అడుగుపెట్టింది. అంటే ప్రస్తుతం ఐపీఎల్ పదకొండో సీజన్ జరుగుతోంది. అయితే, ఈ టోర్నీలో వివిధ దేశాలకు చెందిన స్టార్ క్రికెటర్లు పాలు పంచుకుంటారు. వీరిలో ఒకరు భారత క్రికెటర్ రోహిత్ శర్మ. ఈ క్రికెటర్ ఐపీఎల్ సిక్సర్ల మొనగాడిగా మారాడు. ఎలాగో చూద్ధాం.
 
నిజంగా ఐపీఎల్-11లో తొలి మూడు మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చాడు. సొంత అభిమానుల మధ్య అచ్చొచ్చిన మైదానంలో కెప్టెన్ విశ్వరూపం చూపించాడు. ఈ పోరులో రోహిత్ (94: 52 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న హిట్‌మ్యాన్ ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. 
 
బుధవారం వరకు ఐపీఎల్ టోర్నీలో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ రెండోస్థానంలో సాధించాడు. భారత్ తరపున ప్రథమ స్థానం మాత్రం హిట్‌మ్యాన్‌దే. ఓవరాల్‌గా అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా కరీబియన్ స్టార్ క్రిస్‌గేల్ 269 సిక్సర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆర్‌సీబీతో మ్యాచ్‌లో 5 సిక్సర్లు బాదడంతో అతడి సిక్సర్ల సంఖ్య 179కి చేరింది. దీంతో అతడు ద్వితీయ స్థానం సంపాదించాడు. 
 
మూడో స్థానంలో సురేశ్ రైనా(174), ఏబీ డివిలియర్స్(166), విరాట్ కోహ్లీ(166) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. రోహిత్ తన ఐపీఎల్ కెరీర్‌లో 163 మ్యాచ్‌ల్లో 4345 పరుగులు సాధించగా అందులో ఒక శతకంతో పాటు 33 అర్థశతకాలున్నాయి. మొత్తం 368 ఫోర్లు బాదాడు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments