ఐపీఎల్ : కోల్‌కతాకు చుక్కలు.. సన్‌రైజర్స్ మూడో గెలుపు
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. కెప్టెన్ విలియమ్సన్ సూపర్ ఇన్నింగ్స్ ఆడటంతో కోల్‌కతాపై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. చివర్లో యూసుఫ్ పఠాన్ స
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. కెప్టెన్ విలియమ్సన్ సూపర్ ఇన్నింగ్స్ ఆడటంతో కోల్‌కతాపై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. చివర్లో యూసుఫ్ పఠాన్ సిక్స్ బాదగా.. ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ తొలి విజయాన్ని అందుకుంది. 139 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన హైదరాబాద్ పవర్ ప్లే ముగిసేలోగానే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది.
అయితే విలియమ్సన్ (50), షకీబుల్ హసన్ (27) రాణించడంతో హైదరాబాద్‌కు గెలుపు సులువైంది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఓపెనర్ క్రిస్ లిన్ (34 బంతుల్లో 49) ధాటిగా ఆడగా.. కెప్టెన్ దినేష్ కార్తీక్ (29), నితీష్ రాణా (18) ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. దీంతో సన్ రైజర్స్ చేతిలో కోల్ కతా పరాజయం పాలైంది.