Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్ 2018 : సొంతగడ్డపై ప్రత్యర్థులను చితక్కొడుతున్న సన్‌రైజర్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ అంచె పోటీల్లో భాగంగా, సన్‌రైజ్ హైదరాబాద్ జట్టు కుర్రోళ్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌లలో విజయభేరీ మోగించారు.

Advertiesment
ఐపీఎల్ 2018 : సొంతగడ్డపై ప్రత్యర్థులను చితక్కొడుతున్న సన్‌రైజర్స్
, శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (13:29 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ అంచె పోటీల్లో భాగంగా, సన్‌రైజ్ హైదరాబాద్ జట్టు కుర్రోళ్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌లలో విజయభేరీ మోగించారు. ముఖ్యంగా, గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టును ఒక్క వికెట్ తేడాతో చిత్తు చేశారు. ఫలితంగా సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వరుసగా రెండో విక్టరీ కొట్టింది.
 
జట్టు ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ (45) మరోసారి విజృంభించగా.. ఆఖరులో దీపక్‌ హూడా (32 నాటౌట్‌) సత్తా చాటడంతో ముంబై నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని రైజర్స్‌ 9 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి చేరుకుంది. తొలుత ముంబై 8 వికెట్లకు 147 పరుగులు చేసింది. ఎవిన్‌ లెవిస్‌ (29), సూర్యకుమార్‌ యాదవ్‌ (28), కీరన్‌ పొలార్డ్‌ (23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 28) మినహా మిగిలిన బ్యాట్స్‌మన్‌ నిరాశ పరిచారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో సందీప్‌, స్టాన్‌లేక్‌, సిద్దార్థ్‌ కౌల్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. రషీద్‌ ఖాన్‌ (4-0-13-1) ఆకట్టుకున్నాడు.
 
విజయలక్ష్యం చిన్నదే అయినప్పటికీ.. సన్‌రైజర్స్ వరుసగా వికెట్లు చేజార్చుకోవడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. ఒక దశలో సన్‌రైజర్స్‌ విజయానికి చివరి 42 బంతుల్లో 41 పరుగులు కావాల్సి ఉన్నాయి. ఈ దశలో యూసుఫ్‌ పఠాన్‌ (14), దీపక్‌ హూడా నిలకడగా ఆడడంతో జట్టు సులభంగా నెగ్గేలా కనిపించింది. కానీ, 18వ ఓవర్లో బుమ్రా వరుస బంతుల్లో యూసుఫ్‌, రషీద్‌ (0)ను అవుట్‌ చేయడంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. 
 
ఆపై... 19వ ఓవర్లో ఒకే పరుగు ఇచ్చిన ముస్తాఫిజుర్‌.. సిద్దార్థ్‌ కౌల్‌ (0), సందీప్‌ శర్మ (0)ను అవుట్‌ చేయడంతో ఆతిథ్య జట్టులో ఆందోళన తీవ్రమైంది. చివరి ఓవర్లో 11 పరుగులు అవసరమవగా.. చేతిలో ఒకే వికెట్‌ ఉన్నది. బంతితో కటింగ్‌... బ్యాట్‌తో దీపక్‌ హూడా... ఫుల్‌లెంగ్త్‌లో వచ్చిన తొలి బంతిని దీపక్‌ సిక్సర్‌గా మలచడంతో స్టేడియం మార్మోగింది. తర్వాత వైడ్‌ రావడంతో సమీకరణం 5 బంతుల్లో 4గా మారింది. రెండో బంతికి పరుగు రాలేదు. తర్వాతి మూడు బంతుల్లో మూడు సింగిల్స్‌ వచ్చాయి. ఆఖరి బంతికి ఒక పరుగు అవసరం అవగా స్టాన్‌లేక్‌ (5 నాటౌట్‌) బౌండ్రీ కొట్టి జట్టును గెలిపించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''దంగల్'' బబితకు రజతం.. అమీర్ ఖాన్ తరహాలోనే క్లైమాక్స్‌లో..?