Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 26 April 2025
webdunia

ఓం ప్రకాశ్‌ను కలవడం చాలా సంతోషంగా వుంది: వీరేంద్ర సెహ్వాగ్

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మెంటార్‌గా వీరేంద్ర సెహ్వాగ్‌ వ్యవహరిస్తున్నాడు. క్రికెటర్‌గా బౌండరీలు, సిక్సర్లుగా ఉరకలెత్తించిన సెహ్వాగ్, రిటైర్మెంట్ తర్వాత సోషల్

Advertiesment
IPL 2018
, బుధవారం, 18 ఏప్రియల్ 2018 (16:10 IST)
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మెంటార్‌గా వీరేంద్ర సెహ్వాగ్‌ వ్యవహరిస్తున్నాడు. క్రికెటర్‌గా బౌండరీలు, సిక్సర్లుగా ఉరకలెత్తించిన సెహ్వాగ్, రిటైర్మెంట్ తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వున్న సంగతి తెలిసిందే. తాజాగా సెహ్వాగ్‌ను కలిసేందుకు ప్రత్యేకమైన అభిమాని మొహాలీ వచ్చాడు. 
 
మైదానంలో జట్టు ప్రాక్టీస్ చేస్తుండగా.. ఓ పెద్దాయన సెహ్వాగ్ దగ్గరకు వచ్చి పాటియాలా నుంచి వచ్చానని చెప్పాడు. తన పేరు ఓం ప్రకాశ్ (93) అని.. సెహ్వాగ్‌కు పెద్ద అభిమానినని తెలిపాడు. 70 కిలోమీటర్లు ప్రయాణించి సెహ్వాగ్ కోసం వచ్చానని చెప్పడంతో డాషింగ్ ఓపెనర్ షాక్ అయ్యాడు. ఆయన చూపించిన అభిమానానికి ఫిదా అయిపోయాడు. పెద్దాయన పాదాలకు సెహ్వాగ్ నమస్కారం చేశాడు. 
 
దీనికి సంబంధించిన ఫోటోలను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ట్విట్టర్‌లో పంచుకున్నాడు. ఓం ప్రకాశ్‌ను కలవడం చాలా సంతోషంగా వుందని.. 93ఏళ్ల వయసులో తనకోసం పాటియాలా నుంచి వచ్చారు. తనపై ఎంతో ప్రేమ కురిపించారని పేర్కొన్నాడు. ప్రత్యేకమైన అభిమానుల్ని సంపాదించుకున్న సెహ్వాగ్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెంగళూరుతో ఐపీఎల్ మ్యాచ్: 46 పరుగులతో ముంబై ఇండియన్స్ విన్