Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలకృష్ణతో రామానుజాచార్య చిత్రం, చెన్నైలో కళ్యాణ్ అమ్యుస్మెంట్ పార్క్ నిర్మాణం : నిర్మాత సి. కళ్యాణ్

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (18:14 IST)
C. Kalyan
''నందమూరి బాలకృష్ణ గారితో 'రామానుజాచార్య' ప్రాజెక్ట్ ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించడానికి చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. ఓ అంతర్జాతీయ సంస్థ, రవి కొట్టారకర తో కలసి చినజీయర్ స్వామి వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను. కళ్యాణ్ అమ్యుస్మెంట్ పార్క్ ఇనాగరేషన్ రోజున ఈ ప్రాజెక్ట్ ఓపెనింగ్ అనుకుంటున్నాం. కళ్యాణ్ అమ్యుస్మెంట్ పార్క్ నిర్మించడం దేవుడు ఇచ్చిన వరం.'' అన్నారు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు, నిర్మాత సి. కళ్యాణ్. రేపు (శుక్రవారం) ఆయన బర్త్ సందర్భంగా విలేఖరుల సమావేశం నిర్వహించారు.  
 
కళ్యాణ్ అమ్యుస్మెంట్ పార్క్ గురించి ?
కళ్యాణ్ అమ్యుస్మెంట్ పార్క్ ప్రాజెక్ట్ చేయడం తమిళనాడు ప్రభుత్వం, దేవుడు ఇచ్చిన వరం. చెన్నై నుండే ఒక సహాయ దర్శకుడిగా నా కెరీర్ ప్రారంభమైయింది. ఇప్పుడు అక్కడ ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయడం ఒక మైల్ స్టోన్ మార్క్ గా నిలుస్తోంది. అలాగే సదరన్ ఇండస్ట్రీకి ప్రతి ఏడాది పెద్ద ఎత్తున అవార్డులు ఇచ్చే కార్యక్రమం కూడా చేపడుతున్నాం. సదరన్  ఇండస్ట్రీ కి పెద్దపీట వేస్తూ గోవా ఫిల్మ్ ఫెస్టివల్ కు మించి అవార్డ్స్ ని ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేస్తున్నాం. ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ సపోర్ట్ తో వచ్చే ఏడాది జనవరి ఇది మొదలుపెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. ఇది చాలా పారదర్శకంగా వుంటుంది. ఇందులో వచ్చే ప్రతి రూపాయిలో సినిమా ఇండస్ట్రీ, సినీ కళాకారుల కోసమే వాడుతాం. కళ్యాణ్ అమ్యుస్మెంట్ పార్క్ ని చేసే అవకాశం ఇచ్చింది సినీ ఇండస్ట్రీ. ఇది ఖచ్చితంగా పెద్ద కల్ప వృక్షం అవుతుందని నమ్ముతున్నాను. దిని ఫలాలు సినీ ఇండస్ట్రీకే దక్కాలి.
 
కళ్యాణ్ అమ్యుస్మెంట్ పార్క్ కి స్టాలిన్ ప్రభుత్వం సపోర్ట్  వుందా ?
స్టాలిన్ గారి ప్రభుత్వం సపోర్ట్ తోనే  బాగా చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ తో స్టాలిన్ గారి ప్రభుత్వానికి కూడా పెద్ద పేరు వస్తుంది. చెన్నై కి హార్ట్ లాంటి ప్లేస్ దిన్ని నిర్మిస్తున్నాం. ప్రజలకు కావాల్సిన ఎంటర్ టైన్ మెంట్, ఫుడ్, కల్చరర్ ఈవెంట్స్ అన్నీ ఇందులో వుంటాయి. దాదాపు 200 కోట్ల ప్రాజెక్ట్ ఇది. దానికి తగ్గ మంచి ప్లేస్ దొరికింది. టూరిజం కు ఇది తలమానికంగా వుంటుంది. ఎంట్రీ ఫీజు 50 రూపాయిలు వుంటుంది. అక్కడ గేమ్స్ కి విడిగా ఛార్జీలు వుంటాయి. క్యాష్ లావాదేవీలు వుండవు. చేతికి వాచ్ లాంటింది ఇస్తారు. దానిని రీఛార్జ్ చేసుకోవాల్సి వుంటుంది.
 
మీ గత చిత్రం గాడ్సే నిరాశపరిచిందా ?
మంచి సినిమా చేయాలని గాడ్సే తీశాం. అది మంచి సినిమానే. చాలా బావొచ్చింది. అయితే ప్రేక్షకులు ఓటీటీలో చూసినంతగా థియేటర్లో చూడలేదు. అయితే ఆ సబ్జెక్ట్ ని మోయగలిగే ఆర్టిస్ట్ కావాలి. ఈ సంగతి దర్శకుడికి ముందే చెప్పాను. అయితే అప్పటికే హీరోని ఫిక్స్ అయిపోయి వున్నాం. ఆ సబ్జెక్ట్ ని మోయగలిగేది తెలుగులో ఇద్దరే. పవన్ కళ్యాణ్, జూ. ఎన్టీఆర్. ఇందులో ఎవరు చేసినా గాడ్సే ఒక చరిత్ర సృష్టించేది. పిల్లల్ని చదివించి, వారికీ ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్న తల్లితండ్రులందరికీ ఇది రీచ్ అవుతుందని భావించాం. కానీ కుదరలేదు. ఇదొక్కటే బాధ వేసింది. అయితే ఈ సినిమా ఎక్కడా రాజీపడకుండా తీశాం. ఎక్కడా వెనకడుగు వేయలేదు. సత్యదేవ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో చేసిన సినిమా గాడ్సే. అయితే సినిమాలో డబ్బు పొతే పోయిందని అనుకోను. సినిమా ఇచ్చిన డబ్బుని అదే తీసుకెళ్ళిందని భావిస్తాను.
 
ముఫ్ఫై రోజు షూటింగ్ ఆపడం వలన ఏమైనా ప్రయోజం చేకూరిందా ?
అది అట్టర్ ఫ్లాఫ్ షో.  చిన్న సినిమా నిర్మాతకు విడుదల రోజున చాలా సమస్యలు వున్నాయి. వీటికి పరిష్కారం దొరుకుతుందని దీనికి సమ్మతించాను. మొదటి నాలుగు మీటింగ్స్ లోనే దీంతో ఏం జరగదని అర్ధమైపోయింది. కొన్ని సమస్యలు, లోపాలు గుర్తించారు. కానీ వాటి అమలు జరగలేదు.  సినిమా పరిశ్రమ బ్రతికుందంటే కొత్తగా వచ్చే రెండు వందల మంది నిర్మాతల వలనే అని భావిస్తాను.
 
సంక్రాంతి సినిమాల విషయంలో కౌనిల్స్ వ్యాఖ్యల ని ఎలా చూస్తారు ?
చిరంజీవి గారి సినిమా నిర్మాతలు గానీ , బాలకృష్ణ గారి సినిమాల నిర్మాతలు గానీ ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు చేయకుండా ఈ విషయంలో కౌన్సిల్ మాట్లాడటం వంద శాతం తప్పు. ఈ సంగతి వాళ్లకి కూడా చెప్పాను. అయితే కీడు చేసే గుణం వున్న వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద హిట్లు ఇచ్చిన వారు గానీ ఫైనల్ గా జీరోలుగానే వెళ్లారు కానీ ఎవరూ హీరోగా వెళ్ళలేదు. ఇండస్ట్రీ ఇచ్చిన రూపాయితో మనం నిలబడ్డాం. ఇండస్ట్రీ కి ఉపయోగపడమని నా మనవి.  
 
థియేటర్లు రెంటల్ వ్యవస్థ నుండి పర్సెంటెజ్ లోకి ఎప్పుడు మారొచ్చు ?
కొందరు పెద్ద వారు దిన్ని మారనివ్వరు. దీనికి కారణం కూడా మీకు తెలుసు. దేవుడి దయవల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు ఎన్.టీ రామారావు గారి లాంటి ముఖ్యమంత్రులు వచ్చి స్లాబ్ సిస్టం తెస్తే కానీ ఇది మారదు.
 
కొత్త సినిమాల గురించి ?
ఎస్వీ కృష్ణా రెడ్డి గారి ఆర్గానిక్ మామా హైబ్రీడ్ అల్లుడు సినిమా రెడీ అయ్యింది. ఆయనకు మళ్ళీ మంచి బ్రేక్ వస్తుందని అనుకుంటున్నాను. అందరూ ఫ్యామిలీతో కలసి ఆ సినిమాని థియేటర్లోనే చూడాలని అనుకుంటారు. చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అది. ఇంకొన్ని చిన్న సినిమాలని చేస్తున్నాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహారాష్ట్రలో మహాయుతి భారీ విజయం వెనుక 5 కీలక కారణాలు, ఏంటవి?

కంట్లో నలక పడిందని వెళితే కాటికి పంపిన ఆసుపత్రి

జార్ఖండ్‌లో 24 ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్.. మళ్లీ సీఎంగా హేమంత్ సోరేన్

నేషనల్ మీడియాలో పవన్ ప్రస్తావన: 70 శాతం పట్టున్న కాంగ్రెస్ స్థానాలను NDA ఖాతాలో వేసాడంటూ...

మహారాష్ట్ర సీఎం ఎవరు? మోదీ, అమిత్ షాల ఓటు ఎవరికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments