బాచుపల్లి సెట్లో ఎన్ బి.కె. 108 చిత్రం ప్రారంభం
						
		
			      
	  
	
			
			  
	  
      
								
			
				    		 , గురువారం,  8 డిశెంబరు 2022 (13:55 IST)
	    	       
      
      
		
										
								
																	నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఎన్ బి.కె. 108 చిత్రం ప్రారంభం అయింది. హైద్రాబాద్ లోని బాచుపల్లి గ్రామంలో వేసిన సెట్లో షూటింగ్ ప్రారంభమైంది. గురువారం ;పౌర్ణమి రోజున ఉదయం 9 గంటల 36 నిమిషాలకి పూజా కార్యక్రమంతో చిత్రాన్ని ఆరంభించారు. ఎంతో అట్టహాసంగా ఈ కార్యక్రమం అనేక మంది సినీ ప్రముఖులతో జరిగింది. దేవుని పటాలపై ముహూర్తం షాట్ తీశారు.
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
									
										
										
								
																	అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. చిత్ర నిర్మాతలు, బాలకృష్ణ దర్శకుడు కి స్క్రిప్ట్ అందజేశారు. 
 
									
										
								
																	
									
										
										
								
																	దిల్ రాజు కెమెరా స్విచ్చ్ ఆన్  చేయగా,  కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్యం వహిందారు. షైన్_స్క్రీన్స్ నిర్మాణం వహిస్తున్నారు.  మైత్రి మూవీస్, శ్రీ వెంకటేస్వర క్రియేషన్స్ అధినేతలు  దిల్ రాజు, శిరీష్, నవీన్ యెర్నేని, సతీష్ కిలారు సహకరిస్తున్నారు. 
 
									
											
							                     
							
							
			        							
								
																	
									
										
										
								
																	ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్ సినిమాస్ కూడా  . కాగా ఓ భారీ జైలు సెట్ లో ఈ సినిమా యాక్షన్ బ్లాక్ తో స్టార్ట్ కానున్నట్టుగా  తెలుస్తుంది.
 
									
			                     
							
							
			        							
								
																	
		
		 
		
				
		
						 
		 
		  
        
		 
	    
  
	
 
	
				       
      	  
	  		
		
			
			  తర్వాతి కథనం