యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, బాల్లయ్య కాంబిషన్ చిత్రాలంటే తెలిసిందే. అఖండ తర్వాత మరల బాలకృష్ణతో సినిమా ఉంటుందని చెప్పారు. కానీ కొన్ని కమిట్మెంట్స్ వల్ల ఇద్దరు బిజీ అయ్యారు. అందులో భాగంగా హీరో రామ్ తో బోయపాటి శ్రీను సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ తండ్రిగా కీలకమైన పాత్రను బాలీవుడ్ హీరోగా అనిల్ కపూర్ ని తీసుకున్నారని తెలుస్తోంది. దీనిపై అధికారికంగా తెలపాల్సి ఉంది. రామ్ సినిమాలు హిందీలో డబ్ అవుతుంటాయి. అందుకే బాలీవుడ్ నటుడు ఐతే బాగుంటున్నదని అంచనాకు వచ్చారు.
ఇక, బోయపాటి యాక్షన్ తరహాలో రామ్ ;పక్క మాస్ పాత్ర పోషించనున్నారు. ఇస్మార్ట్ శంకర్ ని మించి పాత్ర ఉండేలా డిజైన్ చేస్తున్నట్లు సమాచారం.కాబట్టి బోయపాటి చేస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. హీరోయిన్ గా కూడా బాలీవుడ్ నటిని ఎంపిక చేయనున్నారు.