Webdunia - Bharat's app for daily news and videos

Install App

సహనం - సమయస్ఫూర్తితో సింహాల గుంపుకు పరీక్ష పెట్టిన జిరాఫీ... ఎక్కడ?

Webdunia
బుధవారం, 29 ఏప్రియల్ 2020 (12:44 IST)
ఆ జిరాఫీకి సహనం ఎక్కువు. అంతకంటే.. మంచి సమయస్ఫూర్తి. ఫలితంగా తనపై దాడి చేసిన సింహాల గుంపుకే పరీక్ష పెట్టింది. ఇదీ గంటో అరగంటో పరీక్ష కాదు.. ఏకంగా ఐదు గంటల పరీక్ష. ఈ పరీక్షలో సింహాల గుంపు తోకముడుచుకుని పారిపోయాయి. ఫలితంగా ఆ జిరాఫీ ప్రాణాలను దక్కించుకుంది. ఈ అరుదైన దృశ్యం సౌతాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్కులో ఆవిష్కృతమైంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ జాతీయ పార్కులో కనిపించిన ఈ అరుదైన ఘటనను ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి నవీద్ ట్రుంబో తనకు అందిన వీడియోను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి షేర్ చేశాడు. 'ఈ వీడియో మనకు ఓ పాఠాన్ని నేర్పుతోంది. క్రూరంగా తనపై దాడి చేస్తున్న వేళ, 5 గంటల పాటు ఈ జిరాఫీ బెదరకుండా నిలబడిపోయింది. దేన్నైనా సాధించాలంటే ఓపిక ముఖ్యమని జిరాఫీ నిరూపించింది' అని ఆయన కామెంట్ పెట్టాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. వేల కొద్దీ లైక్స్ వస్తున్నాయి. 
 
కాగా సమయస్ఫూర్తికి సహనం తోడైతే ఇక తిరుగే వుండదన్న విషయాన్ని ఈ జిరాఫీ విషయంలో తేటతెల్లమైంది. తనపై కొన్ని సింహాల గుంపు దాడి చేసినా.. ఏమాత్రం బెదరకుండా, పారిపోకుండా సమయస్ఫూర్తితో, ఓర్పు, సహనంతో ఏక బిగువున ఐదు గంటల పాటు నిలబడి తన ప్రాణాలను ఓ జిరాఫీ రక్షించుకుంది. 
 
సింహాల గుంపు దాని శరీరంపై పడి దొరికిన భాగాన్ని దొరికినట్టు కొరుకుతూ ఉన్నా, ఆ బాధను ఓర్చుకుంటూ.. సహనంతో నిలబడి, ప్రాణాలతో బయటపడింది. ఆ జిరాఫీ ఎంతకూ కింద పడకపోవడంతో సింహాలు చేసేదేమీ లేక, దాన్ని వదిలేసి వెనక్కు వెళ్లిపోయాయి. ఆ వీడియోనూ మీరూ చూడండి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments