Webdunia - Bharat's app for daily news and videos

Install App

జన్‌ధన ఖాతాల్లోని సొమ్ము వెనక్కి... ఎవరికి.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 29 ఏప్రియల్ 2020 (12:19 IST)
కరోనా లాక్‌డౌన్ కారణంగా బ్యాంకుల్లో జన్‌ధన్ ఖాతాలు కలిగిన వారికి నెలకు రూ.500 చొప్పున మూడు నెలల పాటు డబ్బులు జమ చేస్తామని కేంద్రం వెల్లడించింది. ఆ ప్రకారంగా తొలి విడత నగదు సొమ్మును ఏప్రిల్ మొదటి వారంలో జమ చేసింది. 
 
అయితే, చాలా మంది జన్‌ధన్ ఖాతాలు కలిగివున్నప్పటికీ వారిలో చాలా మంది పీఎంజీకేవై పథకం కింద ఈ సొమ్మును పొందేందుకు అర్హులుకాదని తేలింది. దీంతో ఆ సొమ్మును తెలంగాణ గ్రామీణ బ్యాంకు వెనక్కి తీసుకుంది. ఇలా మొత్తం రూ.16 కోట్లను వెనక్కి తీసుకుంది. 
 
కేంద్రం నిర్ణయం మేరకు.. పీఎంజీకేవై పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో 473 తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖల్లో ఖాతాలు కలిగివున్న సుమారు 9 లక్షల మందికి డబ్బులు జమయ్యాయి. వీరిలో 5,15,260 మంది మాత్రమే అర్హులని, మిగతా వారు అనర్హులని బ్యాంకు అధికారులు తేల్చారు. దీంతో అనర్హులకు ఖాతాల నుంచి డబ్బును వెనక్కి తీసుకుంది. 
 
అయితే, చాలా మంది డబ్బు పడిన వెంటనే డబ్బును విత్ డ్రా చేశారనీ, అలాంటి వారిని గుర్తించి, వారి నుంచి డబ్బును తిరిగి రాబట్టేందుకు చర్యలు చేపట్టినట్టు తెలంగాణ బ్యాంగు జనరల్ మేనేజర్ మహేశ్ తెలిపారు. ఆగస్టు ఒకటో తేదీ 2014 తర్వాత ప్రారంభించిన ఖాతాలు మాత్రమే అర్హమైనవన్న నిబంధనలు ఉన్నాయని వెల్లడించారు. తాము పొరపాటున నగదును జమ చేశామని, వారం తర్వాత దాన్ని గుర్తించామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments