రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.1500 నగదు ఇస్తోంది. అలాగే, కేంద్ర ప్రభుత్వం రూ.500 నగదును బ్యాంకు ఖాతాల్లో వేస్తోంది. ఈ సొమ్మును బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. దీన్ని తీసుకునేందుకు ఖాతాదారులు బ్యాంకులు క్యూ కడుతున్నారు. ఫలితంగా బ్యాంకుల వద్ద సామాజిక భౌతిక దూరం కనిపించడం లేదు.
దీనిపై తెలంగాణ లీడింగ్ బ్యాంకు అధికారులను వివరణ అడగగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం జమ చేసిన పైసలు ఎప్పుడైనా తీసుకోవచ్చిన ప్రజలు బ్యాంకుల వద్ద గుమికూడవద్దని విజ్ఞప్తి చేశారు.
కొందరు పైసలు తీసుకోకుంటే వెనుకకు వెళ్లిపోతాయన్న అపోహతోనే బ్యాంకులకు పరుగులు తీస్తున్నారని, అది పూర్తిగా తప్పని వెల్లడించారు. ఆ పైసలు మీ ఖాతాల్లోనే జమ ఉంటాయి.
ఎక్కడికి వెళ్లవని వివరణ ఇచ్చారు. బ్యాంకుల వద్ద గుంపుగా చేరితే లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుందని వెల్లడించారు. ప్రజలు భౌతిక దూరం పాటించాలని కోరారు.