గుజరాత్ రాష్ట్రంలో అరుదైనదృశ్యం కంటికి కనిపించింది. ఏడు సింహ రాజుల గుంపు... జనావాసాల్లో చక్కర్లు కొట్టాయి. వీటిని చూసిన స్థానికులు గజగజ వణికిపోయారు. సింహ రాజుల చక్కర్లను ఓవ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. ఈ దృశ్యం గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ్ జిల్లాలో కనిపించింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జునాగఢ్‌లోని గిరినగర్ వీధుల్లోకి గత శుక్రవారం రాత్రి ఏడు సింహాలు వచ్చాయి. అవి వీధుల్లో ఇష్టానుసారంగా చక్కర్లు కొట్టాయి. జనావాసాల మధ్య హాయిగా తిరిగాయి. వీటిని చూసిన జనాలు భయంతో వణికిపోయారు. తమ ఇళ్ళకు తలుపులు వేసుకుని బిక్కుబిక్కు మంటూ గడిపారు.
అయితే, ఓ వ్యక్తి చిత్రీకరించి సామాజిక మధ్యమాల్లో పోస్ట్‌చేయడంతో వీడియో వైరల్‌గా మారింది. స్థానికులిచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు, సింహాలను అడవిలోకిపంపించారు.
కాగా, ఈ విషయమై జునాగఢ్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్(డీసీఎఫ్) ఎస్కే బేర్వాల్ మాట్లాడుతూ.. గిర్ అభయారణ్యం సమీపంలోనే ఉండటంతో ఈ సింహాల గుంపు జనావాసాల మధ్యకు వచ్చిందని, వర్షాలు పడినా, పడకున్నా సింహాలు అలా స్వేచ్ఛగా తిరుగుతాయనీ, అది వాటి స్వభావమని వివరణ ఇచ్చారు.