Webdunia - Bharat's app for daily news and videos

Install App

9/11 దాడులు.. మా దేశంలోనే నిందితులు.. కనిపెట్టలేకపోయారు.. ముషారఫ్

Webdunia
ఆదివారం, 30 డిశెంబరు 2018 (14:01 IST)
పాకిస్థాన్‌లో తిరిగి అధికారం కోసం మాజీ నేత ముషారఫ్ వీడియో ప్రస్తుతం కలకలం రేపుతోంది. పాకిస్థాన్‌లో తాను తిరిగి అధికారాన్ని పొందేందుకు అమెరికా సహకరించాలని కోరుతున్న మాజీ నేత ముషారఫ్ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. 


ఈ వీడియోలో అమెరికా మద్దతిస్తే తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవడం తనకు సులభమేనని తెలిపారు. దీన్ని ఎప్పుడు చిత్రీకరించారో తెలియదుగానీ, పాకిస్థానీ కాలమిస్ట్ గుల్ బుఖారీ దీన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
 
ఈ వీడియోలో అమెరికా ఇచ్చిన డబ్బుతోనే పాకిస్థాన్ టెర్రరిజంపై పోరాడుతోందని చెప్పారు. తన హయాంలో పేదరికాన్ని 34 శాతం నుంచి 17 శాతానికి తగ్గించామని ఆ వీడియోలో వెల్లడించారు. ఒసామా బిన్ లాడెన్ పాకిస్థాన్‌లో ఉన్నా కనుగొనడంలో విఫలమైన మాట నిజమేనని చెప్పుకొచ్చారు. 
 
ఈ విషయంలో ఐఎస్ఐని క్షమించవచ్చని ముషారఫ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 9/11 దాడుల విషయంలో తమ దేశంలోనే నిందితులు ఉన్నా అమెరికా ఇంటెలిజెన్స్ కూడా పసిగట్టలేకపోయిందని ముషారఫ్ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments