అదృష్టమంటే ఇది... లాటరీలో 1.28 బిలియన్ డాలర్ల జాక్‌పాట్

Webdunia
ఆదివారం, 31 జులై 2022 (10:17 IST)
అమెరికాకు చెందిన ఓ వ్యక్తికి అదృష్ట దేవత తలుపుతట్టింది. ఆ అదృష్టం కూడా మామూలు అదృష్టం కాదు. ఈ అదృష్టం కోట్లాది రూపాయలను గుమ్మరించింది. ఏకంగా రూ.10,136 కోట్లు (అమెరికన్ డాలర్లలో 1.28 బిలియన్ డాలర్లు) ఒక్కసారిగా వచ్చిపడ్డాయి. మెగా మిలియన్స్ అనే సంస్థ నిర్వహిచి ఈ లాటరీలో రెండు డాలర్లు పెట్టిన లాటరీ టిక్కెట్ కొనుగోలు చేసిన ఓ వ్యక్తిని అదృష్ట దేవత ఈ విధంగా కనికరించింది. 
 
ఈ టిక్కెట్ వివరాలను ఆ సంస్థ తాజాగా వెల్లడించింది. ఇల్లినాయిస్ రాష్ట్రంలోని ఓ పెట్రోల్ బంకు వద్ద ఈ టిక్కెట్ అమ్ముడైనట్టు మెగా మిలియన్స్ తెలిపింది. అయితే, ఆ వ్యక్తి ఎవరే విషయం తెలియాల్సి వుందని పేర్కొంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ లాటరీ గత 2015 నుంచి జరిగిన 29 డ్రాలలో ఎక్కరికి కూడా జాక్‌పాట్ బహుమతి వరించలేదు. 
 
కానీ, తాజాగా ఓ వ్యక్తికి ఈ జాక్‌పాట్ తగిలింది. పైగా, అగ్రరాజ్యం అమెరికాలో గత ఐదేళ్ళలో ఇదే అతిపెద్ద జాక్‌పాట్ కావడం గమనార్హం. మొత్తంగా ఆ దేశ చరిత్రలో మూడో అతిపెద్ద జాక్‌పాట్ కావడం గమనార్హం. అయితే, ఈ అదృష్టాన్ని వరించిన ఆ అమెరికన్ ఎవరన్నది తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments