ఎక్స్ ఆర్మీ ఆఫీసరే. కానీ చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఈ విషయం భార్యకు తెలిసింది. అంతే సహించలేకపోయింది. అంతే పట్టరాని ఆగ్రహంతో భర్తని నిలదీసింది. భర్త ఎదురు తిరగడంతో తుపాకీతో కాల్చింది. ఈ ఘటన యూఎస్‌లోని వాషింగ్టన్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. యూఎస్‌లోని వాషింగ్టన్‌లో మాండరిన్ ఓరియంటల్ హోటల్‌లో ఉంటున్నారు భార్యా భర్తలు జేమ్స్ వీమ్స్, శాంతేరీ వీమ్స్. జేమ్స్ కు 57 ఏళ్లు. శాంతేరీకి 50 ఏళ్లు. వారి ఓ డే కేర్ సెంటర్ నడుపుతున్నారు. 2005లో ఆర్మీ నుంచి రిటైర్ అయి జేమ్స్ గత రెండేళ్లుగా డేకేర్‌లో బస్సు ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో జేమ్స్ వీమ్స్ డేకేర్ సెంటర్ లో చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు.
ఈ క్రమంలో భర్త జేమ్స్ వీమ్స్ చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు అతడి భార్య శాంతేరీ వీమ్స్ గుర్తించింది. ముగ్గురు చిన్నారులపై దారుణైన అఘాయిత్యాలకు పాల్పడ్డాడని తెలుసుకుంది. భర్తను నిలదీసింది.. చేసింది దారుణం అని తెలుసుకోకపోవటం శాంతేరి భరించలేక తుపాకీతో కాల్చింది.
ఈ ఘటనపై పోలీసులు శాంతేరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తుపాకీ తూటాలతో గాయపడిన జేమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కానీ భర్తను కాల్చి చంపిన నేరాలపై పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
దర్యాప్తులో భాగంగా పోలీసులు గదిలో దొరికిన డైరీని స్వాధీనం చేసుకుని చదివారు. ఆలో డైరీ అత్యంత ఆసక్తికరంగా ఉంది. ఆ డ్రైరీలో..తన భర్త ముగ్గురి పిల్లల జీవితాలను నాశనం చేశాడని, పలువురి చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడినట్లు రాసి ఉందని పోలీసులు తెలిపారు.