Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాన్, ఉత్తర కొరియాలపై ఫైర్ అయిన డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్, ఉత్తర కొరియాలపై విరుచుకుపడ్డారు. ఉత్తర కొరియా అణు పరీక్షలను లెక్కచేయబోమని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికాను భయపెట్టాలని ఓ వైపు నుంచి ఉత్తర కొరియా, మరోవైపు నుం

Webdunia
ఆదివారం, 15 అక్టోబరు 2017 (11:14 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్, ఉత్తర కొరియాలపై విరుచుకుపడ్డారు. ఉత్తర కొరియా అణు పరీక్షలను లెక్కచేయబోమని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికాను భయపెట్టాలని ఓ వైపు నుంచి ఉత్తర కొరియా, మరోవైపు నుంచి ఇరాన్ దేశాలు కలలు కంటున్నాయని, వారి కలలు నెరవేరే సమస్యే లేదని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ పూర్తి ఉగ్రవాద దేశం గా మారేలా అడుగులు వేస్తోందని ట్రంప్ ఆరోపించారు. 
 
కయ్యానికి కాలుదువ్వుతున్న ఉత్తర కొరియాను కట్టడి చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సైనిక సలహాదారులతో సమావేశమయ్యారు. ఉత్తర కొరియా ఎలాంటి అతిక్రమణలకూ దిగినా స్పందించేందుకున్న అవకాశాలు, అమెరికా మిత్రదేశాలపై కిమ్‌ ప్రభుత్వం అణుదాడి బెదిరింపులను అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చ జరింగింది. రక్షణమంత్రి జేమ్స్‌ మాటిస్‌, జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ చైర్మన్‌ జనరల్‌ జోసెఫ్‌ డన్ఫోర్డ్‌ కూడా ఈ బేటీలో పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికాను భయపెట్టాలని దుస్సాహసం చేస్తే.. అందుకు తగిన ఫలితాలను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధంగా ఉండాలన్నారు. గువామ్‌పై దాడి చేయాలంటే.. చెప్పినంత తేలిక కాదని.. ఆ రెండు దేశాల ప్రతి అడుగునూ తాము నిశింతగా గమనిస్తున్నామని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'పుష్ప 2' చిత్ర టికెట్ ధరల పెంపునకు టి సర్కారు అనుమతి

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments