సారీ ఆ ఒక్కటే ఉ.కొరియాపై బాగా పనిచేస్తుంది: యుద్ధం ఖాయమన్న ట్రంప్
అమెరికా-ఉత్తర కొరియాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఉత్తరకొరియా లక్ష్యంగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ఉత్తరకొరియా అమెరికాతో చేసుకున్న అన్నీ ఒప్పందాలను ఉల్ల
అమెరికా-ఉత్తర కొరియాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఉత్తరకొరియా లక్ష్యంగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ఉత్తరకొరియా అమెరికాతో చేసుకున్న అన్నీ ఒప్పందాలను ఉల్లంఘించిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఎప్పుడూ ట్విట్టర్లో యాక్టివ్‌గా వుండే ట్రంప్.. ఉత్తర కొరియా నిబంధనలను పక్కనబెట్టి తన పనితాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు.
ఎంతో మంది అధ్యక్షులు, వారి కార్యదర్శులు గత 25ఏళ్ల పాటు ఉత్తరకొరియాతో ఎడతెగని చర్చలు జరిపారని ట్రంప్ ట్విట్టర్లో గుర్తు చేశారు. ఇందుకోసం భారీగా సొమ్ములు అప్పగించారని.. కానీ అవేమీ పనిచేయలేదన్నారు.
మధ్యవర్తులను ఫూల్స్ చేస్తూ.. కాగితాలపై సిరా ఆరిపోకముందే.. ఉత్తర కొరియా కుదుర్చుకున్న ఒప్పందాలను ఉల్లంఘించిందని, సారీ, కేవలం ఒకే ఒక్కటి దీనికి బాగా పనిచేస్తుంది.. అంటూ ఆయన ఉత్తరకొరియాతో యుద్ధం అనివార్యమని ట్రంప్ స్పష్టంగా ట్వీట్ చేశారు.