Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మేము రంగంలోకి దిగితే మాత్రం వదిలిపెట్టేది లేదు: డొనాల్డ్ ట్రంప్

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించారు. కిమ్ జాంగ్ చెడు ప్రవర్తనను చూపుతున్నారని ఆరోపించారు. అణుపరీక్షలతోనే కాకుండా ప్రవర్తనా పరంగా రెచ్చిపోతున్న

మేము రంగంలోకి దిగితే మాత్రం వదిలిపెట్టేది లేదు: డొనాల్డ్ ట్రంప్
, బుధవారం, 27 సెప్టెంబరు 2017 (18:03 IST)
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించారు. కిమ్ జాంగ్ చెడు ప్రవర్తనను చూపుతున్నారని ఆరోపించారు. అణుపరీక్షలతోనే కాకుండా ప్రవర్తనా పరంగా రెచ్చిపోతున్నారని ఫైర్ అయ్యారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉద్రిక్తతలు పెరిగాయని అంగీకరిస్తున్నానని తెలిపారు. అత్యంత సులువుగా సమస్యను పరిష్కరించుకునే పరిస్థితిలో ఉన్నప్పటికీ ఉత్తర కొరియా అవన్నీ పక్కనబెట్టేసిందన్నారు. 
 
కాగా.. తరచూ క్షిపణి ప్రయోగాలు చేస్తూ ప్రపంచ దేశాలను ఆందోళనలకు గురి చేస్తున్న ఉత్తర కొరియాపై సైనిక చర్య చేపట్టేందుకు సర్వం సిద్ధం చేసుకున్నామని ట్రంప్ అన్నారు. కానీ యూఎస్ బాంబర్లను తాము కూల్చివేయగలమని, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి ప్రకటించిన మరుసటి రోజే ట్రంప్ తీవ్రంగా స్పందించారు. 
 
సైనిక చర్య అనే పదం తమ తొలి ఆప్షన్ కాదని.. రెండో ఆప్షన్ గానే దాన్ని ఎంచుకున్నామన్నారు. ఒకవేళ తాము రంగంలోకి దిగితే మాత్రం పూర్తి విజయం సాధించే వరకూ వదిలేది లేదని స్పెయిన్ ప్రధాని మారియానో రజోయ్‌ఐతో కలసి పాల్గొన్న సంయుక్త మీడియా సమావేశంలో ట్రంప్ హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అటు కరుణ.. ఇటు నటరాజన్ ఆరోగ్యంపై వదంతులపై... తమిళనాడులో హైఅలెర్ట్