Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయుల మెడపై ట్రంప్ కత్తి : హెచ్‌1బీ వీసాల్లో కోత

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో కఠిన నిర్ణయం తీసుకోనున్నారు. హెచ్1బీ వీసాల్లో భారీ సంఖ్యలో కోత విధించాలని ఆయన ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే సుమారుగా ఐదు లక్షల మంది భారతీయులు ఉపాధిని కో

H-1B Visa
Webdunia
బుధవారం, 3 జనవరి 2018 (10:36 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో కఠిన నిర్ణయం తీసుకోనున్నారు. హెచ్1బీ వీసాల్లో భారీ సంఖ్యలో కోత విధించాలని ఆయన ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే సుమారుగా ఐదు లక్షల మంది భారతీయులు ఉపాధిని కోల్పోయి స్వదేశానికి రావాల్సిన నిర్భంధ పరిస్థితి నెలకొననుంది. 
 
అమెరికా అధ్యక్ష పీఠంపై ట్రంప్ కూర్చొన్నది మొదలుకుని, ఓ వ్యూహం ప్రకారం భారతీయ ఉద్యోగుల్ని, నిపుణులను ఆయన లక్ష్యంగా చేసుకున్న విషయం తెల్సిందే. ఇపుడు మరోమారు కొరఢా ఝళిపించటానికి సిద్ధమవుతున్నారు. అమెరికాలో గ్రీన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసి హెచ్‌1బీ వీసాపై నివాసముంటున్న వారిని వెనక్కి తిప్పి పంపటానికి ఒక ప్రతిపాదనను సిద్ధం చేసింది. 
 
దీనిని కనుక అమలు చేస్తే దాదాపు ఏడు లక్షల మంది నిపుణులపై ప్రభావం పడుతుంది. దాదాపు లక్ష మందికి పైగా భారతీయ నిపుణులు స్వదేశానికి తిరిగి రావాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనపై అమెరికాలోని భారతీయుల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది.
 
ప్రతి ఏడాది 85 వేల మందికి హెచ్‌1బీ వీసాలు మంజూరు చేస్తారు. వీటిలో 70 శాతం భారతీయులకే దక్కుతాయి. వీరిలో ఎక్కువ మంది కంప్యూటర్‌ సిస్టమ్స్‌ ఎనలిస్ట్‌, అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్‌, కంప్యూటర్‌ ప్రోగ్రామర్స్‌గా పనిచేసేవారే ఎక్కువ. కానీ గత రెండేళ్ళుగా కంపెనీల వీసాల వినియోగం సగానికి సగం - అంటే పదివేల కంటే దిగువకు పడిపోయింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments