Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అణ్వస్త్ర బటన్ కిమ్ టేబుల్ పైన వుందా? అలాంటి బటన్లు నా చేతుల్లోనే వుంటాయి... ట్రంప్

ఉత్తర కొరియా కిమ్ మాటలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రివర్స్ ఎటాక్ ఇచ్చారు. కిమ్ అణ్వస్త్ర బటన్ తన టేబుల్ పైన వుంటే... అలాంటి బటన్లు చాలా తన చేతుల్లో ఎప్పుడూ సిద్ధంగా వుంటూనే వుంటాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే కొత్త సంవత్సరం... కొంగ్ర

అణ్వస్త్ర బటన్ కిమ్ టేబుల్ పైన వుందా? అలాంటి బటన్లు నా చేతుల్లోనే వుంటాయి... ట్రంప్
, బుధవారం, 3 జనవరి 2018 (10:33 IST)
ఉత్తర కొరియా కిమ్ మాటలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రివర్స్ ఎటాక్ ఇచ్చారు. కిమ్ అణ్వస్త్ర బటన్ తన టేబుల్ పైన వుంటే... అలాంటి బటన్లు చాలా తన చేతుల్లో ఎప్పుడూ సిద్ధంగా వుంటూనే వుంటాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే కొత్త సంవత్సరం... కొంగ్రొత్త ఆశలు, ఆశయాలు, ఆవిష్కరణలతో ముందుకెళ్లాలని ప్రపంచం భావిస్తోంది. కానీ, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ మాత్రం తద్విరుద్ధంగా ఆలోచనలు చేస్తున్నారు. ప్రపంచాన్నే భయపెట్టే హెచ్చరికలు చేస్తున్నారు. తన టేబుల్‌పైనే అణ్వస్త్ర బటన్ ఉందంటూ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
తన టేబుల్‌పైనే న్యూక్లియర్ వెపన్ బటన్ ఉంటుందంటూ కిమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత యేడాదంతా వరుస అణు పరీక్షలు, క్షిపణి పరీక్షలతో అగ్రరాజ్యం అమెరికాకు నిద్రలేకుండా చేసిన కిమ్ జాంగ్ ఉన్... ప్రపంచదేశాలకు కొరకరాని కొయ్యగా మారారు. ఈయనను కట్టడి చేసేందుకు ఐక్యరాజ్యసమితి రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. పలు రకాల ఆంక్షలను ఇప్పటికే ఉత్తరకొరియాపై విధించారు. అంతేకాదు ప్రతి అవకాశాన్ని ఉత్తరకొరియాపై పైచేయి సాధించేందుకు అమెరికా ఉపయోగించుకొంటుంది.
 
ఈ నేపథ్యంలో ఆయన కొత్త సంవత్సరం రోజున ఓ సంచలన ప్రకటన చేశారు. "నా టేబుల్‌పై ఎప్పుడూ ఒక బటన్‌ ఉంటుంది. నొక్కితే అంతా బుగ్గిపాలే. అది.. న్యూక్లియర్‌ వెపన్‌" అంటూ ప్రకటించారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని తమ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రపంచదేశాలకు హెచ్చరిక చేశారు కిమ్. తమ జోలికి వస్తే చూస్తూ ఊరుకొనేది లేదని కిమ్ ఈ సందేశంలో తేల్చి చెప్పారు. 
 
కొత్త సంవత్సరంలో ఎలాంటి ఉపద్రవాలు లేకుండా ఉండాలని కోరుకొంటున్న తరుణంలోనే హెచ్చరికలతోనే కొత్త సంవత్సరంలోకి కిమ్ కొత్త సంవత్సరంలోకి అడుగిడెలా చేశారు. ఇప్పటికే అణు పరీక్షలతో కిమ్ అమెరికాతో పాటు ఇతర దేశాలకు సవాల్‌ విసురుతున్నారు. అయితే ట్రంప్ మాత్రం అలాంటి బటన్లు తన చేతుల్లోనే వున్నాయనీ, అంతకంటే చాలా శక్తివంతమైనవనీ వార్నింగ్ ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముగ్గురు భార్యలు.. రెండు వ్యాపారాలు.. ఇదీ ఆ బిచ్చగాడి జీవితం...