ముగ్గురు భార్యలు.. రెండు వ్యాపారాలు.. ఇదీ ఆ బిచ్చగాడి జీవితం...
సాధారణంగా రైళ్ళతో పాటు ఆలయాలు, మసీదులు, చర్చిల ముంగిట బిచ్చగాళ్లు కనిపిస్తుంటారు. వీరిలో చాలా మంది సంపాదనపరులు ఉంటారు. ఇలాంటివారిలో ఛోటూ బారిక్ ఒకరు. లక్షాధిపతి అయిన ఈయనకు ముగ్గురు భార్యలు. రెండు సైడ్
సాధారణంగా రైళ్ళతో పాటు ఆలయాలు, మసీదులు, చర్చిల ముంగిట బిచ్చగాళ్లు కనిపిస్తుంటారు. వీరిలో చాలా మంది సంపాదనపరులు ఉంటారు. ఇలాంటివారిలో ఛోటూ బారిక్ ఒకరు. లక్షాధిపతి అయిన ఈయనకు ముగ్గురు భార్యలు. రెండు సైడ్ బిజినెస్‌లు. నివాసం జార్ఖండ్ రాష్ట్రంలోని చక్రధర్‌పూర్ రైల్వేస్టేషన్.
తాజాగా, ఇతని జీవితానికి సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ బిచ్చగాడి నెల ఆదాయం రూ.30 వేలు కాగా, ఆయనకు ముగ్గురు భార్యలు. పాత్రల దుకాణం నిర్వహిస్తున్నాడు. వెస్ట్రిజ్ అనే చైన్ మార్కెటింగ్‌లో సభ్యుడు. అతని కింద మరో 10 మంది పనిచేస్తుంటారు.
బారిక్ వయసు 40 ఏళ్లు. రైళ్లలో భిక్షాటన చేస్తుంటాడు. గ్రామంలో అతను ఏర్పాటు చేసుకున్న పాత్రల దుకాణాన్ని అతని భార్య పర్యవేక్షిస్తుంటుంది. మొబైల్ ఫోను ద్వారానే తన వ్యాపారాన్ని చక్కదిద్దుతుంటాడు. బాల్యంలో దుర్భరమైన పేదరికాన్ని అనుభవించిన చోటూ బారిక్ మరో పని చేయలేక యాచన ప్రారంభించాడు.