ట్రంప్ వ్యాఖ్యల్లో వున్న అర్థమేమిటి? మధ్యంతర ఎన్నికలకు సంకేతాలిచ్చారా?
అమెరికన్లు స్మార్ట్ ఓటర్లని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. 2017కు వీడ్కోలు పలికి, 2018కి స్వాగతం చెప్పేవేళ.. ఆయన మధ్యంతర ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఈ క్రమంలో యూఎస్ కాంగ్ర
అమెరికన్లు స్మార్ట్ ఓటర్లని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. 2017కు వీడ్కోలు పలికి, 2018కి స్వాగతం చెప్పేవేళ.. ఆయన మధ్యంతర ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఈ క్రమంలో యూఎస్ కాంగ్రెస్‌ను నియంత్రించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. యూఎస్ పన్ను వ్యవస్థ, స్టాక్ మార్కెట్లు నష్టపోతున్న తీరును ట్విట్టర్ ద్వారా ట్రంప్ ప్రస్తావించారు.
అలాగే అమెరికన్లు స్మార్ట్ ఓటర్లని, 2018లో వారు డెమోక్రాట్లను ఎందుకు ఎంచుకుంటారని అడిగారు. డెమోక్రాట్ల విధానాలు, అమెరికా గొప్ప చరిత్రను, సంస్కృతిని, సంపదను హరించి వేసేలా ఉన్నాయని ట్రంప్ విమర్శలు గుప్పించారు.
ఐఎస్ఐఎస్, వీఏ, జడ్జస్, స్ట్రాంగ్ బార్డర్, సెకండ్ ఏ తదితర పదాలను పలికేందుకు అమెరికన్లు ఇష్టపడటం లేదని అన్నారు. వీటిల్లో ఆయుధాల నిషేధం దిశగా, రాజ్యాంగ సవరణను సూచించే 'సెకండ్ ఏ'పై చర్చ సాగుతున్న వేళ ట్రంప్ మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.