Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హఫీజ్ సయీద్, ముషారఫ్‌ కలిసి ఎన్నికలు వెళ్లారో?

సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ డిప్లొమసీ హెడ్ పాల్ స్టాట్ పాకిస్థాన్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రపంచ దేశాలకు మంచిది కాదని పాల్ స్టాట్ తెలిపారు. హఫీజ్ సయీద్, మాజీ సైనిక నియంత ముషారఫ్‌లు కలస

Advertiesment
హఫీజ్ సయీద్, ముషారఫ్‌ కలిసి ఎన్నికలు వెళ్లారో?
, బుధవారం, 13 డిశెంబరు 2017 (14:46 IST)
కరుడుగట్టిన ఉగ్రవాది, జామాత్ ఉద్ దవా వ్యవస్థాపకుడు, లష్కరే తోయిబా ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన హఫీద్ సయీజ్ అంటే తనకు ఎంతో ప్రేమ, ఇష్టమని పాకిస్థాన్ మాజీ సైనిక నియంత పర్వేజ్ ముషారఫ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాశ్మీర్ వేర్పాటువాదులకు సయీద్ ఎంతో సహకారం అందిస్తున్నాడని కూడా ముషారఫ్ వ్యాఖ్యానించారు. 
 
జీహాద్‌కు ఊతమిచ్చే సయీద్ అంటే తనకెంతో మమకారమని ముష్ చెప్పుకొచ్చారు. సయీద్‌తో ఎన్నోసార్లు భేటీ అయ్యానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ డిప్లొమసీ హెడ్ పాల్ స్టాట్ పాకిస్థాన్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రపంచ దేశాలకు మంచిది కాదని పాల్ స్టాట్ తెలిపారు. 
 
హఫీజ్ సయీద్, మాజీ సైనిక నియంత ముషారఫ్‌లు కలసి ఎన్నికలకు వెళితే ప్రమాదకరమైన పరిస్థితులు తప్పవని స్టాట్ హెచ్చరించారు. హఫీజ్‌కు ముషారఫ్ బహిరంగంగా మద్దతు పలకడం ద్వారా విపరీత పరిస్థితులు తప్పవన్నారు. వీరిద్దరి కలయిక ప్రపంచానికే ప్రమాదకరమని తెలిపారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో అమెరికా పూర్తిస్థాయిలో బంధాలను తెంచుకోవడం మంచిదని సూచించారు.
 
ముంబై దాడులతో హఫీజ్‌కు సంబంధం ఉందనే విషయంపై ఆధారాలు లేవంటూ పాకిస్థాన్ కోర్టులు ప్రకటించడంపై స్టాట్ స్పందిస్తూ.. హఫీజ్ విడుదల భారత్- పాకిస్థాన్ సంబంధాలకు ఇది స్వాగతించే వార్త కాదన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బర్త్‌డే పేరుతో రేవ్ పార్టీ.. అమ్మాయిల నగ్న నృత్యాలు