Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్‌కు భారత్ దెబ్బకు దెబ్బ!.. 10 రోజుల పాటు...

Webdunia
శనివారం, 2 అక్టోబరు 2021 (12:40 IST)
బ్రిటన్‌కు భారత్ దెబ్బకు దెబ్బ ఇచ్చింది. టిట్‌ ఫర్‌ టాట్‌ అన్నట్లుగా వ్యవహరించింది. భారత్‌కు వచ్చే బ్రిటన్‌ పౌరులు టీకా వేయించుకున్నప్పటికీ విధిగా పది రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. సోమవారం నుంచి ఇది అమలులోకి వస్తుందని తెలిపింది. 
 
'అక్టోబర్ 4 నుండి భారతదేశానికి వచ్చే బ్రిటన్‌ జాతీయులంతా, వారి టీకా స్థితితో సంబంధం లేకుండా, మూడు కోవిడ్‌ 19 ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రయాణానికి 72 గంటల ముందు, విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు, భారత్‌కు వచ్చిన 8వ రోజు తర్వాత కరోనా టెస్ట్‌లు చేయించుకోవాలి. అలాగే భారతదేశానికి చేరిన తర్వాత ఇంట్లో లేదా గమ్యస్థాన చిరునామాలో తప్పనిసరిగా 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి' అని ప్రకటించింది.
 
బ్రిటన్‌ ప్రభుత్వం కూడా ఇటీవల భారతీయ ప్రయాణికుల పట్ల ఇలాంటి ఆంక్షలు విధించింది. కోవిషీల్డ్‌ టీకా గుర్తింపు, వ్యాక్సిన్‌ సర్టిఫికేట్‌పై అనుమానాలు వ్యక్తం చేసింది. దీనిపై భారత్‌ సీరియస్‌ అయ్యింది. దీంతో కోవిషీల్డ్‌ను అనుమతించిన వ్యాక్సిన్‌గా పరిగణిస్తున్నట్లు తెలిపింది. 
 
అయితే భారతీయ టీకా సర్టిఫికేట్‌ను గుర్తించబోమని చెప్పింది. కాగా, దీనిపై ప్రతి చర్యలు తీసుకుంటామని భారత్‌ వార్నింగ్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో భారత్‌కు వచ్చే బ్రిటన్ పౌరులు వారి టీకా స్థితితో సంబంధం లేకుండా విధిగా పది రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనంటూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

వెన్నెల కిషోర్, మోనికా చౌహాన్, కమల్ కామరాజు ల‌ ఒసేయ్ అరుంధతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments