Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యూకేకు భారత్ దెబ్బ

Advertiesment
యూకేకు భారత్ దెబ్బ
, శుక్రవారం, 1 అక్టోబరు 2021 (22:47 IST)
ఇటీవల అంతర్జాతీయ ప్రయాణ నిబంధనలను సవరించిన యూకేకు దీటుగా భారత్ స్పందించింది. యూకేలాంటి నిబంధనే యూకే పౌరులకు కూడా విధించింది. ఈ నెల 4 నుంచి భారత్ రావాలనుకునే యూకే పౌరులకు ఆర్టీ-పీసీఆర్ టెస్టు నెగటివ్ రిపోర్టు తప్పనిసరి అని పేర్కొంది.

అలాగే, భారత్‌లో అడుగుపెట్టడంతో 10 రోజుల తప్పనిసరి క్వారంటైన్‌లో ఉండాలంటూ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. యూకేలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నత్తనడకన సాగుతుండడం కూడా భారత్ నిర్ణయానికి ఓ కారణం. 
 
ప్రభుత్వ తాజా నిబంధనలు:
* అక్టోబరు 4 నుంచి తాజా నిబంధనలు వర్తిస్తాయి
* ప్రయాణానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీ-పీసీఆర్ టెస్టు నెగటివ్ రిపోర్టు తప్పనిసరి
* భారత్ చేరుకున్న తర్వాత మరోమారు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి
* దేశంలో అడుగుపెట్టిన 8 రోజుల తర్వాత మరోమారు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి
* ఇండియాకు చేరుకున్న తర్వాత ఇంటిలో కానీ, గమ్యస్థాన ప్రదేశంలో కానీ 10 రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలి  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ