Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదేళ్ల బాలికపై రోజుకు వంద మంది అత్యాచారం చేసేవారు..?

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (18:39 IST)
ఐసిస్ తీవ్రవాదుల ఆగడాలకు అడ్డు లేకుండా పోతోంది. పదేళ్ల బాలికను సెక్స్ బానిసగా మార్చిన ఉగ్రమూక చిన్నారిపై వందసార్లు అత్యాచారం జరిపింది. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. వారి చెరలో ఇలాంటి బాధిత బాలికలు వేల మంది ఉన్నారు. సిరియా, ఇరాక్‌లలో ఐసిస్ ఉగ్రవాదులు యాజిది తెగకు చెందిన పురుషులను మూకుమ్మడిగా చంపేస్తారు. ఆడవారిపై అత్యాచారాలు జరిపేవారు. 
 
మహిళలను ఎత్తుకెళ్లి, వారిని వయసుల వారీగా విభజించి మరీ సెక్స్ బానిసలుగా మార్చేసారు. 10-20 నుంచి ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలతో సీనియర్ జిహాదీలు ఎంజాయ్ చేసి వాళ్లను మరొకరికి విక్రయించేవారు. ఇందులో ఇరాక్‌కు చెందిన మార్వా ఖేదర్ అనే పదేళ్ల చిన్నారి ఉగ్రవాదుల కామవాంఛకు బలైంది. అంత చిన్న వయస్సులోనే గర్భం దాల్చింది. ఒక స్నేహితురాలు ద్వారా విషయం ఆ చిన్నారి మేనత్తకు తెలిసింది.
 
పదేళ్ల వయసున్న అనేక మంది చిన్నారులను కనీసం వందకు మంది పైగా రేప్ చేసేవారు. ఫలితంగా వారు గర్భం దాల్చేవారని ఐసిస్ నుండి పారిపోయి వచ్చిన వారు చెప్పేవారని జియాద్ అవదల్ తెలిపారు. ఆయన గతంలో టీచర్‌గా పని చేసారు. ఐసిస్ నుండి పారిపోయి వచ్చిన యాజిదిలకు ఆయన ఆశ్రయం కల్పిస్తున్నారు.
 
అయితే మార్వా ఖేదర్‌ అత్తయిన మహద్య కూడా ఐసిస్ బాధితురాలే కావడం గమనార్హం. ఆమెకు 8, 9 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలున్నారు. వీరందరినీ కిడ్నాప్ చేసి, ఆమెను కూడా బానిసగా మార్చేసారు.

అడ్డు తిరిగితే ఆమె పిల్లలను పెళ్లి చేసుకుంటామని చెప్పి మరీ ఆమెను అన్ని విధాలుగా లొంగదీసుకున్నారని, అంతేకాకుండా తనను ఎంతో మందికి విక్రయించడం వల్ల ఎన్నిసార్లు అమ్ముడుపోయిందో తనకే తెలియదంటూ వాపోయింది. ఎట్టకేలకు ఆమె ఫిబ్రవరి మొదటి వారంలో ఐసిస్ చెర నుండి తప్పించుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం