Webdunia - Bharat's app for daily news and videos

Install App

జస్ట్ ట్రై చేసిన పాకిస్తాన్... పేల్చేసిన భారత్

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (16:09 IST)
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకార దాడులు జరిగిన కొద్ది గంటల్లోనే పాకిస్థాన్ మరో దుస్సాహసానికి ప్రయత్నించింది. కెమెరా అమర్చిన పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ఒక డ్రోన్ భారత భూభాగంలోకి ప్రవేశించింది. అప్రమత్తమైన భారత ఆర్మీ దాన్ని క్షణాల్లో పేల్చేసింది.
 
మంగళవారం వేకువజామున 3.30 గంటలకు వైమానిక దాడులు జరగగా సరిగ్గా ఉదయం 6.30 గంటల ప్రాంతంలో గుజరాత్‌లోని కచ్ అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న నలియా ఎయిర్‌బేస్‌కు సమీపంలో తిరుగాడుతున్న డ్రోన్‌ను భారత్ గుర్తించింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే దాన్ని పేల్చివేసారు. ఈ ఎయిర్‌బేస్ సరిహద్దుకు అతి సమీపంలో ఉండటంతో ఇక్కడి నుండి భారత్ దాడులకు దిగుతుందేమో అనే వివరాలను తెలుసుకోవడానికి దీన్ని పంపి ఉండవచ్చని విశ్లేషించారు.
 
వైమానిక దాడుల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, పంజాబ్‌లలో హైఅలర్ట్ ప్రకటించగా, గుజరాత్‌లో కూడా అప్రమత్తంగా ఉండాలని త్రివిధ దళాలకు ఆజ్ఞలు జారీ అయ్యాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments