Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆత్మరక్షణ హక్కు మాకూ ఉంది కదా... పాక్

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (15:43 IST)
పుల్వామా ఉగ్రదాడి ద్వారా 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న పాకిస్థాన్‌కు భారత్ ధీటుగా బదులిచ్చింది. జైషే ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్న భారత వాయుసేన మంగళవారం తెల్లవారుజామున మెరుపు దాడులు చేసింది. 12 మిరాజ్‌-2000 జెట్‌ ఫైటర్స్‌తో చేపట్టిన సర్జికల్‌ స్ట్రైక్‌-2 విజయవంతంగా పూర్తి చేసి. దాదాపు 200 నుండి 300 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భారత్‌ చర్యపై అనుసరించాల్సిన విధానంపై చర్చిం‍చేందుకు పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌.. మంత్రులు, ఆర్మీ అధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు.
 
కాగా, భారత్‌ జరిపిన ఈ మెరుపు దాడులపై పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ స్పందిస్తూ, భారత వైమానిక దళాలు దాడి చేసిన విషయాన్ని ధ్రువీకరించారు. "భారత్‌ ఇలాంటి పని చేస్తుందని మేము ప్రపంచానికి చెప్తూనే ఉన్నాము. మా మాటలను భారత్‌ ఈరోజు నిజం చేసి చూపించింది. ఇప్పుడు మేము వాళ్లకు సరైన సమాధానం చెప్పే హక్కు పొందాము. వాస్తవాధీన రేఖను దాటి భారత్‌ నిబంధనలను ఉల్లంఘించింది. ఆత్మరక్షణ హక్కు మాకు కూడా ఉంది కదా" అని ఖురేషీ వ్యాఖ్యానించారు.
 
కాగా భారత్ వైపు నుంచి జరిగినదే ప్రతీకార చర్య అన్నప్పుడు మళ్లీ ఆత్మరక్షణ చర్చ ఎందుకు వస్తుందో మరి ఖురేషీగారికే తెలియాలి. అయితే... ప్రతీకార దాడులు చేసిన నేపథ్యంలో, అధికార యంత్రాంగం ఇప్పటికే దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించి అప్రమత్తం చేయడం తెలిసిన విషయమే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments