Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెల్యూట్ టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్... ప్రిన్స్ మహేష్ బాబు

Advertiesment
Surgical Strike 2
, మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (14:40 IST)
పాకిస్తాన్ భూ భాగంలో తిష్ట వేసి, అదను చూసి దొంగ దెబ్బ తీస్తున్న ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సెల్యూట్ అంటూ ట్వీట్ చేశారు. ఇంకా కాజల్ అగర్వాల్, ప్రీతి జింతాతో పాటు పలువురు సెలబ్రిటీలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి సెల్యూట్ అంటూ ట్వీట్లు పెట్టారు. 
 
కాగా ఫిబ్రవరి 14వ తేదీన పుల్వామాలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఉగ్ర దాడిలో మొత్తం 43 మంది సీఆర్పీఎఫ్ జవానులు అమరులయ్యారు. మొదట ఈ ఘటనకు మేము బాధ్యులం కాదు.. భారత్ మాపై నిరాధార ఆరోపణలు చేస్తోందంటూ ప్రకటించేసి హడావుడి చేసేసిన పాక్, తమ సొంతగూటి ఉగ్రవాద సంస్థ జైషే -ఎ- మొహమ్మద్ తమదే బాధ్యత అని ప్రకటించడంతో తేలు కుట్టిన దొంగలా ఏమీ మాట్లాడలేకపోయింది. 
 
అయితే... ఈ ఉదంతం నేపధ్యంలో భారత్‌లోని అన్ని వర్గాలలోనూ పాక్‌పై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అలాగే పాక్‌పై వెంటనే ప్రతీకార దాడి చేయాలనే డిమాండ్ కూడా గట్టిగానే వినిపించింది. తాజాగా మంగళవారం వేకువజామున భారత వాయుసేన పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహిస్తూండడంతో ఈ వార్త తెలుసుకున్న దేశ ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
ముఖ్యంగా బాలీవుడ్ ప్రముఖులు దీనిపై వెంటనే స్పందించి మోడీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నటుడు అనుపమ్‌ఖేర్ ట్విట్టర్ వేదికగా ‘భారత్ మాతాకీ జై’ అని పేర్కొనగా, మరో నటుడు పరేష్ రావల్ ‘నరేంద్ర మోదీగారూ ధన్యవాదాలు... మన సేనా నాయకులకు జయహో’ అని కామెంట్ చేసారు. అలాగే అజయ్ దేవగన్ ‘భారతీయ వాయుసేనకు సలామ్’ అని పేర్కొనగా, అభిషేక్ బచ్చన్ ‘భారతమాతకు వందనాలు’ అని పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాక్ ఆర్మీ మేల్కొనేలోపే... పని పూర్తి చేసిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్...