Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యవసర మందులిచ్చి ఆదుకోండి.. ప్లీజ్ : భారత్‌కు స్పెయిన్ వినతి

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (16:03 IST)
కరోనా వైరస్ కోరల నుంచి తమ పౌరులను తమ దేశాన్ని రక్షించాలంటూ భారత్‌ను స్పెయిన్ కోరుకుంది. ఈ క్లిష్టపరిస్థితుల్లో తమకు అత్యవసరమైన వైద్యసదుపాయాలను, సామాగ్రిని సమకూర్చాలంటూ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు స్పెయిన్ విదేశాంగ మంత్రి అరంచా గొంజాలెజ్ ఫోన్ చేసి ప్రాధేయపడ్డారు. ఈ విషయంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఓ ట్వీట్ చేశారు. 
 
"స్పెయిన్ ఫారిన్‌ మినిస్టర్ అరంచా గొంజాలెజ్‌తో ఫోన్‌లో మాట్లాడా. కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాల సహకారం అవసరం అని మేమిద్దరం అంగీకరించాం. అలాగే, స్పెయిన్‌కు అత్యవసర ఔషధాలు సరఫరా చేయాలన్న విజ్ఞప్తిపై భారత్ సానుకూలంగా స్పందించింది" అని జైశంకర్ ట్వీట్ చేశారు. స్పెయిన్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి దారుణంగా ఉంది. ఆ దేశంలో ఇప్పటికే 1.48 లక్షల మంది వైరస్ బారినపడగా, మరో 14 వేల మంది మృత్యువాతపడ్డారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments