Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇటలీని వెనక్కి నెట్టిన రష్యా- కరోనా అప్- ప్రజలు ఇష్టారాజ్యంగా తిరిగితే?

Webdunia
సోమవారం, 11 మే 2020 (19:42 IST)
రష్యాలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే వుంది. జనవరి 31న రష్యాలో రెండు కేసులు నమోదయ్యాయి. మార్చి 13 తర్వాత ఐరోపా దేశాలతో కూడా రాకపోకలు నిలిపివేసింది. కానీ దేశంలో లాక్‌డౌన్‌ అమలు చేయడంలో ఆలస్యం చేసింది.

మార్చి 28 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించలేదు. ప్రకటించిన తర్వాత కూడా కఠినంగా అమలు చేయడంలో విఫలమైంది. దీంతో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ప్రజలు కూడా ఇష్టారాజ్యంగా తిరుగుతూ వచ్చారు. 
 
ఫలితంగా జర్మనీ, ఫ్రాన్స్‌ను కూడా దాటేసి ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదైన దేశాల్లో అయిదో స్థానానికి ఎగబాకింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదవుతున్న రష్యాలో ఇప్పటిదాకా 221,344 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 2,009కు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 11,656 కేసులు నమోదయ్యాయి.
 
ఇకపోతే.. రష్యా రాజధాని మాస్కోలో పరిస్థితి దారుణంగా ఉంది. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసులు, మరణాలలో సగం వరకు ఇక్కడ నుంచే ఉండడం ఆందోళన కలిగించే విషయం. సోమవారం రోజున కొత్తగా 6,169 కేసులు పెరిగాయి. దీంతో అధికారిక లెక్కల ప్రకారం మాస్కోలో కేసల సంఖ్య 1,15,909 కు చేరుకుంది. దీంతో రష్యా ఇప్పుడు బ్రిటన్‌, ఇటలీలను దాటేసి మూడో స్థానాన్ని ఆక్రమించింది.

అయితే, అధిక సంఖ్యలో టెస్టులు జరపుతుండడంతోనే కేసుల సంఖ్య పెరుగుతోందని రష్యా అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ 56 లక్షల టెస్టులు జరిపినట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments