Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యాను వణికిస్తున్న కరోనా.. నాలుగు లక్షలకు దాటిన కేసులు

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (16:04 IST)
కరోనా మహమ్మారి రష్యాను వణికిస్తోంది. ఆ దేశంలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. కరోనా బాధిత దేశాల్లో మూడో స్థానంలో ఉన్న రష్యాలో కేసుల సంఖ్య ఇప్పటికే నాలుగు లక్షలు దాటింది. సోమవారం కొత్తగా 9,035 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 414,878కు చేరింది. గడిచిన 24 గంటల్లో 162 మంది చనిపోయారు. ఇప్పటివరకు రష్యాలో కరోనా వల్ల 4,855 మంది మరణించారు.
 
ఇక భారత్ విషయానికి వస్తే మొన్నటి వరకు పదో స్థానంలో ఉండేది రెండు మూడు రోజుల్లోనే ఏడో స్థానానికి చేరుకుంది. అమెరికాలోని న్యూజెర్సీ, న్యూయార్క్‌లలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో గత 24 గంటల్లో మొత్తం 18,37,170 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 1,06,195 మంది మరణించారు.
 
అలాగే బ్రెజిల్, స్పెయిన్ దేశాల్లో మరణాల సంఖ్య 50 వేలు దాటింది. ఇటలీలో 33 వేలు, రష్యాలు 4,600 మంది మృత్యువాత పడ్డారు. ఫ్రాన్స్‌లో 28 వేల మంది వరకు మరణించారు. ఇక బ్రిటన్‌లో అయితే మరణాల సంఖ్య 39 వేలకు చేరుకుంది. లాక్డౌన్ సడలింపులు, వాతావరణంలో మార్పు వైరస్ వ్యాప్తి ఎలా ఉంటుందనేది అధికారులు అంచనా వేయలేకపోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments