తూగో కరోనా దూకుడు ... ఒక్క జిల్లాలోనే 219 ... ఓ గ్రామంలో 113 కేసులు

సోమవారం, 1 జూన్ 2020 (14:15 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటివరకు ఏకంగా 219 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా, జిల్లాలోని పెదపూడి మండలంలోని గొల్లాల మామిడాడ అనే గ్రామంలో 113 మంది కరోనా పాజిటివ్ రోగులు ఉన్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నిజానికి తూర్పు గోదావరి జిల్లాలో సరిగ్గా పది రోజుల క్రితం మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కేవలం 62 మాత్రమే. ఆ తర్వాత ఇంటింటి సర్వే చేపట్టడంతో ఈ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. 
 
ముఖ్యంగా, జి. మామిడాడ గ్రామంలో 5 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఇందులో 120 మందికి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ఈ గ్రామంలో 113 కేసులు ఉన్నట్టు తెలిపారు. దీంతో గ్రామంలో హైఅలెర్ట్ ప్రకటించారు. పైగా, లాక్డౌన్ ఆంక్షలను పోలీసులు మరింత కఠినతరం చేశారు. 
 
ఇదే అంశంపై అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఇంటింటి సర్వే చేపట్టడంతో ఈ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 219 పాజిటివ్ కేసులు ఉన్నట్టు ఆయన తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఆంధ్రప్రదేశ్‌లో మరో 76 కరోనా పాజిటివ్ కేసులు