Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరింతగా విషమించిన పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం!!

ఠాగూర్
ఆదివారం, 23 ఫిబ్రవరి 2025 (11:51 IST)
పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం మరింతగా విషమించింది. ఈ నెల 14వ తేదీ నుంచి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ రోమ్ నగరంలోని గెమిల్లీ ఆస్పత్రిలో 88 యేళ్ల పోప్ ఫ్రాన్సిస్ చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా, శ్వాస తీసుకోవడంలో ఆయన మరింతగా ఇబ్బందిపడుతున్నారు. దీంతో అధిక పీడనంతో ఆక్సిజన్ అందిస్తున్నారు. ఎనీమియా సంబంధిత సమస్య కూడా ఆయనకు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దీంతో ఆయనకు రక్తమార్పిడి కూడా చేశఆరు. దీంతో శుక్రవారం కంటే ఇపుడు ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత కష్టంగా ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఏమీ చెప్పలేమని వాటికన్ సిటీ ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
పోప్ న్యూమోనియాతోపాటు తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. మరో వారం రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుందని పేర్కొన్నారు. మరోవైపు, ప్రమాదం నుంచి పోప్ బయటపడలేదని ఆయన వ్యక్తిగత ఫిజీషియన్ లూగీ కార్పొన్ వెల్లడించారు. 
 
అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో 1936లో జన్మించిన పోప్.. అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. 2013లో నాటి పోప్  బెనెడిక్ట్16 రాజీనామా చేయడంతో ఫ్రాన్సిస్ కేథలిక్ చర్చి అధిపతిగా నియమితులయ్యారు. కాగా, దక్షిణార్థ గోళం నుంచి పోప్ అయిన తొలి వ్యక్తిగా ఆయన సరికొత్త రికార్డును నెలకొల్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

"హరిహర వీరమల్లు" విడుదలకు ముందు వివాదం

శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments